షాకింగ్: కోట్లాది మంది ట్విట్టర్ యూజర్ల డేటా లీక్ ? పేర్లు, ఇమెయిల్ కూడా..

20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్లకు సంబంధించిన 9.4 జీబీ డేటాను హ్యాకర్లు లీక్ చేసి పబ్లిష్ చేసినట్లు సైబర్ ప్రెస్ నిపుణులు గుర్తించారు. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం.. ఇటీవలి కాలంలో ట్విట్టర్ యూజర్ల అతిపెద్ద డేటా లీక్‌లలో ఇది ఒకటి. 

shocking 200 million twitter data leaked online cyber press discovered-sak

ముంబై: గత వారం రోజులుగా ఆన్‌లైన్‌లో డేటా లీకేజీకి సంబంధించి పలు వార్తలు బయటికొస్తున్నాయి. 37.5 కోట్ల మంది ఎయిర్‌టెల్ కస్టమర్ల సమాచారాన్ని, 995 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్ నుండి ఈ-మెయిల్‌తో సహా లీక్ చేసినట్లు హ్యాకర్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మరో డేటా లీక్ వార్త వెలువడింది. ఈసారి సోషల్ మీడియా దిగ్గజం X (గతంలో ట్విట్టర్)ను రిపోర్ట్ ముందుంచింది. 

20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల 9.4 జీబీ డేటాను హ్యాకర్లు లీక్ చేసి పబ్లిష్ చేసినట్లు  సైబర్ ప్రెస్ నిపుణులు గుర్తించారు. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం, ఇటీవలి కాలంలో ట్విట్టర్ యూజర్ల అతిపెద్ద డేటా లీక్‌లలో ఇది ఒకటి. లీక్ అయిన డేటాలో ఇమెయిల్ అడ్రస్, పేర్లు ఇంకా  ఇతర అకౌంట్  సంబంధిత సమాచారం ఉన్నాయి. X-యూజర్‌ల సమాచారం 10 ఫైల్‌లలో  హ్యాకింగ్ ఫోరమ్‌లో పబ్లిష్ చేసారు. వీటిని డౌన్ లోడ్ చేసుకునే విధంగా పబ్లిష్ చేసినట్లు  సైబర్ ప్రెస్ నిపుణులు చెబుతున్నారు. 

హ్యాకర్లు విడుదల చేసిన ట్విట్టర్ అకౌంట్స్ లోని కొంత సమాచారం వాస్తవమేనని సైబర్ ప్రెస్ నిపుణులు ధ్రువీకరిస్తున్నారు. అయితే, సైబర్ ప్రెస్ టీమ్ 9.4 GB సమాచారాన్ని పూర్తిగా వెరిఫై చేయలేకపోయింది. ట్విట్టర్ అకౌంట్స్ సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించారా అనేది స్పష్టంగా తెలియనప్పటికీ... దీన్ని ఇటీవల జరిగిన సైబర్ నేరంగా భావిస్తున్నారు. ట్విట్టర్ అకౌంట్స్ సమాచారం లీక్‌లను అరికట్టేందుకు చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ ప్రెస్ టీమ్ X- యూజర్లకు  సూచించింది. అయితే, కస్టమర్ల డేటా లీక్ అయిన విషయంపై ట్విట్టర్ అధికారులు ఇంకా స్పందించలేదు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios