వాట్సాప్‌లో హెచ్డీ ఫోటోలు పంపాలా.. అయితే ఎలాగో తెలుసుకోండి..

ఇప్పటి నుండి, వినియోగదారులు HD ఫోటోలను పంపవచ్చు, కాబట్టి స్నేహితులు ఇంకా  కుటుంబ సభ్యులు ఫోటోలలోని  ప్రతిది వివరంగా గమనించవచ్చు.  
 

See how to send HD photos on WhatsApp know  here  detail-sak

న్యూఢిల్లీ: వాట్సాప్ ఒక ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్. వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులు ప్రతిరోజూ ఉపయోగిస్తున్నారు. ఇంకా వాట్సాప్  ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. 

WhatsApp ఇప్పుడు HD రిజల్యూషన్‌లో ఫోటోలను పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడుతుంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ ఫీచర్ రాబోయే కొద్ది వారాల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని, త్వరలో హెచ్‌డి వీడియో ఆప్షన్ రాబోతుందని తెలియజేశారు.

ఇప్పటి నుండి, వినియోగదారులు HD ఫోటోలను పంపవచ్చు, కాబట్టి స్నేహితులు ఇంకా  కుటుంబ సభ్యులు ఫోటోలలోని  ప్రతిది వివరంగా గమనించవచ్చు.  

WhatsApp చాట్‌లు ఇంకా గ్రూప్‌లలో HD ఫోటోలను ఎలా పంపాలో చూడండి... 

*ముందుగా WhatsApp తెరిచి, మీరు HD మీడియాను పంపాలనుకుంటున్న చాట్‌ను సెలెక్ట్ చేసుకోండి.

*మీ కెమెరా నుండి కొత్త ఫోటో లేదా వీడియో తీయడానికి సెలెక్ట్ చేసుకొని  లేదా మీ ఫోన్ ఫైల్ పికర్ నుండి మీడియాను సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోండి.

*ఎడిట్ అప్షన్ లో స్టాండర్డ్ లేదా హై క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవడానికి  HD సింబల్ నొక్కండి.

*మీ అప్షన్ సేవ్ చేయడానికి 'done' నొక్కండి.

*చివరగా, మీడియాను సెండ్ చేయండి. మీడియా హై డెఫినిషన్ అని సూచించడానికి చాట్ చిన్న HD బ్యాడ్జ్‌ని చుపిస్తుంది.

రెండు రిజల్యూషన్ అప్షన్స్ అందుబాటులో ఉంటాయి - స్టాండర్డ్ (1600 x 1052) ఇంకా HD (4096 x 2692 వరకు), స్టాండర్డ్  క్వాలిటీతో పంపబడిన ఫోటోలు సాధారణంగా 3MP కంటే తక్కువగా ఉంటాయి. కానీ HD క్వాలిటీతో 12MP వరకు ఉంటుంది. మీడియాను పంపిన ప్రతిసారీ హై క్వాలిటీ మోడ్ తప్పనిసరిగా ఆన్ చేయబడుతుందని గుర్తుంచుకోండి.

స్టాండర్డ్ క్వాలిటీ డిఫాల్ట్ అప్షన్ గా మిగిలిపోయింది. మీ  కనెక్షన్‌లలోని రిసీవర్లు స్టాండర్డ్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా HDకి అప్‌గ్రేడ్ చేయవచ్చు. స్టోరేజ్ సమస్యలను నివారించడానికి పంపినవారు స్టాండర్డ్ క్వాలిటీకు డిఫాల్ట్‌గా ఉంటారు. లో బ్యాండ్‌విడ్త్ ఉన్న వినియోగదారులు క్వాలిటీని ఉంచడానికి లేదా HD ఫోటో-బై-ఫోటోకి అప్‌గ్రేడ్ చేయడానికి సెలెక్ట్ చేసుకోవచ్చు .

HD ఫోటోలు ఏక్కువ స్టోరేజ్‌ని తీసుకుంటుంది కాబట్టి మీ ఫోన్‌లో  ఉన్న స్టోరేజ్‌ని చెక్ చేయడం ముఖ్యం. మీరు మూడు-చుక్కల సింబల్ నొక్కి, ఆపై సెట్టింగ్‌లను సెలెక్ట్ చేసుకొని, ఆపై స్టోరేజ్ అండ్ డేటాను సెలెక్ట్ చేసుకోవడం  ద్వారా  స్టోరేజ్ అండ్ డేటా సెట్టింగ్‌లను యాక్సెస్ చేయవచ్చు. మొబైల్ డేటా, Wi-Fi ఇంకా రోమింగ్ కోసం ఫోటోలు, వీడియోలు, ఆడియో ఇంకా  డాకుమెంట్స్ కోసం ఆటో-డౌన్‌లోడ్ అప్షన్ ఆన్ చేయండి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios