Asianet News TeluguAsianet News Telugu

శాంసంగ్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు ఏకంగా వాటిపై 20 సంవత్సరాల వారంటీ..

ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఎల్‌జి అండ్ శాంసంగ్ ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల మోటార్ లేదా కంప్రెసర్‌పై లాంగ్ వారంటీని (5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల వరకు) ఇస్తున్నాయి. 

Samsungs big announcement, not one or two but these products will get full 20 years warranty
Author
First Published Dec 5, 2022, 12:26 PM IST

ఎలక్ట్రానిక్ ప్రాడక్ట్స్ కొనుగోళ్ళపై కంపెనీలు సాధారణంగా ఒకటి లేదా రెండు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు వారంటీ ఇస్తుండటం మీరు చూస్తుంటారు. కానీ మీరు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 20 సంవత్సరాల వారంటీ ఇవ్వటం ఎప్పుడైనా చూసారా... అవును, నిజమే... ఎలక్ట్రానిక్స్ దిగ్గజం బ్రాండ్ శాంసంగ్ కంపెనీ వారంటీ పరంగా అన్ని కంపెనీలను బీట్ చేస్తూ  పెద్ద ప్రకటన చేసింది. ఏంటంటే శాంసంగ్  వాషింగ్ మెషీన్లు అండ్ రిఫ్రిజిరేటర్లపై 20 సంవత్సరాల వారంటీని మొదటిసారిగా ప్రకటించింది. 

శాంసంగ్ ఆఫర్ ఏమిటి? 
ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఎల్‌జి అండ్ శాంసంగ్ ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల మోటార్ లేదా కంప్రెసర్‌పై లాంగ్ వారంటీని (5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల వరకు) ఇస్తున్నాయి. ఇప్పుడు శాంసంగ్ కంపెనీ రిఫ్రిజిరేటర్లు అండ్ వాషింగ్ మెషీన్లపై 20 సంవత్సరాల వారంటీని ప్రకటించింది. 

విషయం ఏంటంటే కంపెనీ ఈ ఉత్పత్తులపై 1 సంవత్సరం మాత్రమే ఫుల్ వారంటీని ఇస్తుంది. కానీ శాంసంగ్ రిఫ్రిజిరేటర్‌లో ఉపయోగించే డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అండ్ వాషింగ్ మెషీన్‌లో ఉపయోగించే డిజిటల్ ఇన్వర్టర్ మోటర్‌పై పూర్తి 20 సంవత్సరాల వారంటీని ఇస్తుంది. ఈ నిర్ణయంతో శాంసంగ్ మార్కెట్లో ఎల్‌జితో గట్టి పోటీపడుతుంది.

20 ఏళ్లు నో టెన్షన్
ఎలక్ట్రానిక్స్ కంపెనీలు సాధారణంగా ఒకటి నుండి ఐదు సంవత్సరాల వరకు వారంటీని ఇస్తాయి, ఆ తర్వాత కస్టమర్లు థర్డ్ పార్టీ ద్వారా రిపేర్ చేయించుకోవచ్చు. Samsung కంపెనీ 20-సంవత్సరాల వారంటీని ప్రకటించిన తర్వాత, కస్టమర్‌ల ఇక రిపేర్ సంబంధించిన నో టెన్షన్ గా ఉండొచ్చు.

శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ మాట్లాడుతూ, “మా కస్టమర్లకు మంచి పరిష్కారాలను అందించాలనే మా దృష్టికి అనుగుణంగా మా వాషింగ్ మెషీన్లు అండ్ రిఫ్రిజిరేటర్‌లలో ఉపయోగించే డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ ఇంకా కంప్రెసర్‌పై మేము 20 సంవత్సరాల వారంటీని ప్రవేశపెట్టాము. గృహోపకరణాలను తరచుగా మార్చడం వల్ల సమయం ఇంకా శక్తిని ఖర్చు చేయడమే కాకుండా భౌతిక వ్యర్థాలను కూడా సృష్టిస్తుంది. అందువల్ల ఈ చొరవ ఇ-వ్యర్థాలను తగ్గించడంతోపాటు మా కస్టమర్లకు మనశ్శాంతి అందించడమే లక్ష్యం అని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios