Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలోనే అతిపెద్ద కర్వ్ గేమింగ్ మానిటర్.. 60W స్పీకర్ తో డిస్కౌంట్ ధరకే..

ఈ 55-అంగుళాల స్క్రీన్ 1000R కర్వేచర్‌తో వస్తుంది. కాక్‌పిట్ మోడ్ గేమర్‌లకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. దీనితో 16:09 యాస్పెక్ట్ రేషియో ఉంది. ఈ స్క్రీన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

samsung World's largest curved gaming monitor with 60W speaker
Author
First Published Oct 10, 2022, 2:39 PM IST

ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ స్యామ్సంగ్ ప్రపంచంలోనే మొట్టమొదటి 55-అంగుళాల 1000R కర్వ్డ్ గేమింగ్ స్క్రీన్ ఒడిస్సీ ఆర్క్‌ను లాంచ్ చేసింది. ఒడిస్సీ ఆర్క్ 165Hz రిఫ్రెష్ రేట్, 1ms రెస్పాన్స్ రేట్ టైమ్ తో వస్తుంది. ఇప్పుడు కొత్త కాక్‌పిట్ మోడ్ అండ్ బెస్ట్ గేమింగ్ అనుభవం కోసం  ఆర్క్ డయల్ అనే ఎక్స్క్లూసివ్ కంట్రోలర్‌ కూడా పొందుతుంది.

ఈ 55-అంగుళాల స్క్రీన్ 1000R కర్వేచర్‌తో వస్తుంది. కాక్‌పిట్ మోడ్ గేమర్‌లకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. దీనితో 16:09 యాస్పెక్ట్ రేషియో అందుబాటులో ఉంది. ఈ స్క్రీన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది AMD ఫ్రీ సీన్ ప్రీమియం ప్రోతో 1ms రెస్పాన్స్ టైం ఉంది.

ఒడిస్సీ ఆర్క్ 14-బిట్ ప్రాసెసింగ్‌తో క్వాంటం మినీ ఎల్‌ఈ‌డి ఉంది. ఈ స్క్రీన్ ఫుల్ లైట్ అండ్ డార్క్ లో కూడా బెస్ట్ వ్యూ అందిస్తుంది. ఒడిస్సీ ఆర్క్ బెస్ట్ సినిమా అనుభవం కోసం స్యామ్సంగ్ మ్యాట్ డిస్‌ప్లే, సౌండ్ డోమ్ టెక్నాలజీని ఉపయోగించింది. ఈ మానిటర్ యాంటీ గ్లేర్ అండ్ యాంటీ రిఫ్లెక్షన్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.

ఒడిస్సీ ఆర్క్ సరౌండ్ సౌండ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి AI సౌండ్ బూస్టర్‌తో గొప్ప సౌండ్ అందిస్తుంది, డాల్బీ అట్మాస్ సౌండ్ డోమ్ టెక్‌ కూడా ఉంది. దీంతో మొత్తం 60 వాట్ల ఔట్ పుట్ ఉంటుంది. ఇందులో నాలుగు స్పీకర్లతో పాటు రెండు వూఫర్లు కూడా ఉన్నాయి.

ఒడిస్సీ ఆర్క్ మానిటర్ బ్లాక్ కలర్ లో వస్తుంది. Samsung అఫిషియల్ ఆన్‌లైన్ స్టోర్‌లో  స్యామ్సంగ్ షాప్‌లో రూ. 2,19,999 ప్రారంభ ధరకు లభిస్తుంది. ఒడిస్సీ ఆర్క్ మానిటర్ 3 సంవత్సరాల వారంటీతో వస్తుంది.  1TB పోర్టబుల్ SSD T7 షీల్డ్ USB 3.2ని  అక్టోబర్ 10  నుండి 31 మధ్య స్మార్ట్ మానిటర్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ. 10,000 అదనపు డిస్కౌంట్ ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios