Asianet News TeluguAsianet News Telugu

శాంసంగ్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్: 4కే స్మార్ట్ టీవీని కొనండి.. ఫ్లిప్‌కార్ట్‌తో తర్వాత చెల్లించండి..

'స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్' కింద వినియోగదారులు కేవలం 70% చెల్లించి ప్రీమియం శాంసంగ్ టీవీలను కొనుగోలు చేయవచ్చు. మిగిలిన 30% 12 నెలల తర్వాత చెల్లించవచ్చు.

Samsung Smart Upgrade program: Buy a 4k smart TV for now and pay later with flipkart
Author
Hyderabad, First Published Jul 4, 2022, 12:21 PM IST

కన్జ్యూమర్  ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ 'స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్'ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యంతో ప్రారంభించిన ఈ  కన్జ్యూమర్ చౌకైనా ప్రోగ్రామ్‌ వినియోగదారులకు Samsung లైఫ్‌స్టైల్ అండ్ ప్రీమియం టీవీలు Neo QLED, Frame అండ్ Crystal UHDలను సులభంగా కొనుగోలు చేసేందుకు కల్పిస్తుంది.

'స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్' కింద వినియోగదారులు కేవలం 70% చెల్లించి ప్రీమియం శాంసంగ్ టీవీలను కొనుగోలు చేయవచ్చు. మిగిలిన 30% 12 నెలల తర్వాత చెల్లించవచ్చు. వినియోగదారులు పాత టీవీలను పెద్ద స్క్రీన్‌తో ప్రీమియం శామ్‌సంగ్ టీవీలతో రీప్లేస్ చేయడానికి  కూడా సహాయపడుతుంది. 


ఈ ప్రోగ్రామ్ కింద వినియోగదారులు Samsung Crystal 4K UHD TVని కొనుగోలు చేయడానికి మొదట రూ. 23,093 చెల్లించాలి, 12 నెలల తర్వాత మిగిలిన రూ. 9,897 చెల్లించాల్సి ఉంటుంది. Samsung Frame 2021 Series QLED Ultra HD (4K) Smart TVని రూ. 38,493 చెల్లింపుతో కొనుగోలు చేయవచ్చు, మిగిలిన రూ. 16,497 21 నెలల తర్వాత చెల్లిస్తే సరిపోతుంది.

Neo QLED TV
Samsung తాజాగా నియో QLED టెలివిజన్‌ని అద్భుతమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లతో లాంచ్ చేసింది. Neo QLED లేటెస్ట్ క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ ప్రోతో వస్తుంది,  ఈ టీవి న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 8K, రియల్ డెప్త్ ఎన్‌హాన్సర్‌తో పనిచేస్తుంది. Samsung  2022 Neo QLED TV ఇంతకుముందు లేనంత స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ ఫీచర్లతో వస్తుంది ఇంకా దీని యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా సింపుల్ గా ఉంటుంది.

ఫ్రేమ్ టీవీ
ఈ సిరీస్  కస్టమైజేషన్ ఆప్షన్స్ తో పరిచయం చేసారు. ఈ టీవీ 1,400 కంటే ఎక్కువ ఆర్ట్ బ వర్క్స్ కలెక్షన్ తో వస్తుంది, అంటే మీరు టీవీని వాల్‌పేపర్‌గా ఉపయోగించవచ్చు. బెస్ట్ పిక్చర్ క్వాలిటీ కోసం 100% కలర్ వాల్యూమ్ ఉంది. క్వాంటం డాట్ టెక్నాలజీ, పవర్ ఫుల్ క్వాంటం ప్రాసెసర్ 4K, 4K AI అప్ స్కేలింగ్ క్యాపబిలిటీస్, SpaceFit సౌండ్‌తో వస్తుంది, అయితే మీ రూమ్ వాతావరణాన్ని అనలైజ్ చేసి  ఆటోమేటిక్ గా సౌండ్ సెట్టింగ్‌లను ఆప్టిమైజ్ చేస్తుంది.

క్రిస్టల్ UHD TV
క్రిస్టల్ 4K UHD TV ట్రు కలర్స్ బిలియన్ షేడ్స్, క్రిస్టల్ ప్రాసెసర్ 4K ద్వారా ఖచ్చితంగా శక్తివంతమైన ఇమేజెస్ అందిస్తుంది. క్రిస్టల్ 4K UHD TVకి  HDR ఎక్స్పీరియన్స్ ఉంది, చీకటి దృశ్యాలలో కూడా వైడ్ రేంజ్ కలర్స్, చక్కటి క్లారీటీ ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. గేమింగ్ లవర్స్ కోసం స్మూత్ మోషన్ అండ్ స్పష్టమైన చిత్రాలను అందించడానికి మోషన్ యాక్సిలరేటర్ టర్బోతో ప్యాక్ చేయబడింది. దీనితో పాటు ఈ కొత్త మోడల్స్ టీవీలో యూనివర్సల్ గైడ్, గేమ్ మోడ్, ట్యాప్ వ్యూ, శామ్‌సంగ్ టీవీ ప్లస్, PC వంటి అనుకూలమైన ఫీచర్లతో  వస్తాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios