Asianet News TeluguAsianet News Telugu

విపణిలోకి శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 10, 10+

శామ్ సంగ్ మార్కెట్లోకి తాజాగా గెలాక్సీ నోట్ 10, 10 + సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. గెలాక్సీ నోట్ 10 ధర రూ.69,999, గెలాక్సీ 10 + ఫోన్ ధర రూ.79,999గా నిర్ణయించింది. 

Samsung Galaxy Note 10 vs Galaxy S10+ vs Galaxy Note 9 Whats New and Different
Author
New Delhi, First Published Aug 9, 2019, 3:40 PM IST

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ తన గెలాక్సీ నోట్‌ సిరీస్‌లో 10, 10+ ఫోన్లను ఆవిష్కరించింది. భారత్‌లో గురువారం నుంచి వీటి కొనుగోలుకు ప్రీ బుకింగ్ ప్రారంభమైంది. ప్రధాన రీటైల్‌ దుకాణాలతోపాటు ఈ-కామర్స్‌ సైట్లలో ప్రీ బుకింగ్ వసతిని కల్పించారు. అమ్మకాలు మాత్రం ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 

8జీబీ ర్యామ్‌ విత్ 256 జీబీ అంతర్గత మెమరీ గల శామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 10 ఫోన్ ధర భారత్‌లో రూ.69,999గా ఉంటుందని శామ్‌సంగ్‌ ప్రకటించింది. 12జీబీ ర్యామ్ తోపాటు 256 జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజీ గల నోట్‌ 10+ ఫోన్ ధర రూ.79,999గా ఉంటుంది. 

ఈ మోడల్‌లో 12జీబీ+512జీబీ వేరియంట్‌ ధర మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ రెండు ఫోన్లను శామ్‌సంగ్ భారత్‌లో ఆరా బ్లాక్‌, ఆరా గ్లో, ఆరా వైట్ రంగుల్లో విడుదల చేయనున్నది.

ప్రధాన రీటైల్‌ దుకాణాలు సహా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌, టాటా క్లిక్‌ వంటి ఈ-కామర్స్‌ సైట్లలో ప్రీ బుక్‌ చేసుకొనే సదుపాయం ఉందని శామ్‌సంగ్ తెలిపింది. రీటైల్‌ దుకాణాలు, శామ్‌సంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా ప్రీ బుక్‌ చేసుకొనే వారికి రూ.6 వేల వరకూ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ రానుంది. మిగిలిన ఈ-కామర్స్‌ సైట్లలో ఐసీఐసీఐ బ్యాంకు కార్డులకు ఈ ఆఫర్‌ ఇస్తున్నట్లు శాంసంగ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

గెలాక్సీ నోట్‌ 10 ఫోన్ 6.3 అంగుళాల టచ్ స్క్రీన్, ఎగ్సినోస్‌ 9825 ప్రాసెసర్‌, 10 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 12+16+12 ఎంపీ బ్యాకప్ కెమెరాలతోపాటు 3500 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌ సర్వీస్ లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.69,999లకు లభిస్తుంది.  

ఇంకా గెలాక్సీ నోట్‌ 10లో  6.8 అంగుళాల టచ్ స్క్రీన్, ఎగ్సినోస్‌ 9825 ప్రాసెసర్‌, 10 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 12+16+12+0.3 ఎంపీ బ్యాకప్ కెమెరా అమర్చారు. 4300 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ లభిస్తుంది.  ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. 12 జీబీ ర్యామ్‌తోపాటు విత్ 256 జీబీ ర్యామ్‌ల ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఈ ఫోన్ ధరరూ.79,999గా ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios