Samsung Galaxy M53 5G:ఏప్రిల్ 22న లాంచ్.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో అప్‌గ్రేడ్ వెర్షన్ వచ్చేస్తోంది

25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫోన్‌తో  వస్తుంది. ఈ కొత్త ఫోన్ గత సంవత్సరం మూడు బ్యాక్ కెమెరాలు, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో ప్రారంభించిన గెలాక్సీ ఎం52 5జికి అప్‌గ్రేడ్ వెర్షన్.

Samsung Galaxy M53 5G: phone will be launched on April 22 with 120Hz refresh rate

స్యామ్సంగ్ గెలాక్సీ ఎం సిరీస్  కొత్త ఫోన్ స్యామ్సంగ్ గెలాక్సీ ఎం53 5జి (Samsung Galaxy M53 5G)ఇండియా లాంచ్ పై ప్రకటించింది. స్యామ్సంగ్ గెలాక్సీ ఎం53 5జి ఇండియాలో ఏప్రిల్ 22న అందుబాటులోకి రానుంది. ఈ స్యామ్సంగ్ ఫోన్ ని అమెజాన్ ఇండియా ద్వారా విక్రయించనున్నారు. స్యామ్సంగ్ గెలాక్సీ ఎం53 5జి  ప్రాడక్ట్ పేజీ స్యామ్సంగ్ అఫిషియల్ సైట్, అమెజాన్ లో  ప్రత్యక్ష ప్రసారమైంది, దీని ద్వారా ఫోన్  ఫీచర్స్ గురించి సమాచారం  బయటకు వచ్చింది.

 స్పెసిఫికేషన్‌లు
ఈ స్యామ్సంగ్ ఫోన్‌లో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ డెప్త్, నాల్గవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో పంచ్‌హోల్ సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్‌తో వస్తుంది. ఈ కొత్త ఫోన్ గత సంవత్సరం మూడు బ్యాక్ కెమెరాలు, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో ప్రారంభించిన Galaxy M52 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్.

స్యామ్సంగ్ గెలాక్సీ ఎం52 5G ధర దాదాపు రూ. 30,000 ఉండవచ్చు. గత సంవత్సరం, Samsung Galaxy M52 5Gని రూ 29,999 ధర వద్ద ప్రారంభించారు. గెలాక్సీ  ఎం53 5జజి 6జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్‌తో అందిస్తుంది, అంటే బేస్ వేరియంట్‌గా ఉంటుంది. Samsung Galaxy M53 5Gలో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడవచ్చు.

ఈ ఫోన్ లో 5000mAh బ్యాటరీ ఇచ్చారు, దీని బరువు 176 గ్రాములు ఉంటుంది. కనెక్టివిటీ కోసం 5G, 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.2, GPS / A-GPS, USB టైప్-సి పోర్ట్‌ ఉన్నాయి. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios