ఈ సెల్‌లో అసుస్ నోట్‌బుక్‌తో పాటు, అసుస్ ఇండియా సైట్‌లో జనవరి 26 వరకు తక్కువ ధరకు ROG ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సేల్‌లో యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, వారంటీ ఎక్స్‌టెన్షన్ కూడా ఉన్నాయి. 

మీరు కూడా ఎలక్ట్రానిక్ ప్రాడక్ట్స్ కొనేందుకు సేల్ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, మీకో బిగ్ న్యూస్. విజయ్ సేల్స్ నుండి అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ వరకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల భారీ సేల్స్ జరుగుతున్నాయి. ఈ సేల్స్ లో బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఫ్లాట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. విజయ్ సేల్స్ లో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 3,000 వరకు డిస్కౌంట్ ఇస్తుంది. అదేవిధంగా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ లో కూడా ఎన్నో ఆఫర్‌లు ఉన్నాయి. స్మార్ట్ టీవీల నుండి ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్‌లపై ఉన్న డిస్కౌంట్ గురించి తెలుసుకోండి...

అసుస్ ఏ‌ఎం‌డి డేస్ సెల్
ఈ సెల్‌లో అసుస్ నోట్‌బుక్‌తో పాటు అసుస్ ఇండియా సైట్‌లో జనవరి 26 వరకు తక్కువ ధరకు ROG ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సేల్‌లో యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, వారంటీ ఎక్స్‌టెన్షన్ కూడా ఉన్నాయి. అసుస్ ఏ‌ఎం‌డి డేస్ సెల్ మీకు వివో బుక్ 16X (M1603QA), వివో బుక్ ప్రొ 15 (M3500QC) OLED, రోగ్ స్ట్రిక్స్ సిరీస్ – Strix G15 (G513IE), G17 (G713IE)లను ఆఫర్‌లతో కొనుగోలు చేసే అవకాశాన్ని ఇస్తుంది. అదనంగా, మొదటి 100 నోట్‌బుక్, ROG సిరీస్ కస్టమర్‌లు 1+2 వారంటీ పొడిగింపు + 3 సంవత్సరాల యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ (కేవలం రూ. 30,799కి) పొందవచ్చు. ఆఫర్‌ పొందేందుకు కస్టమర్లు తప్పనిసరిగా జనవరి 23 నుండి 26 వరకు ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసి, 15 రోజులలోపు www.asuspromo.inలో రీడీమ్ చేసుకోవాలి.

వాషింగ్ మెషిన్ ఆఫర్
అమెరికన్ బ్రాండ్ వైట్-వెస్టింగ్‌హౌస్ కూడా టీవీలు, వాషింగ్ మెషీన్‌లను ఫ్లిప్‌కార్ట్ సేల్ తక్కువ ధరకు విక్రయిస్తోంది. మీరు సిటీ బ్యాంక్ లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే, మీకు 10% తగ్గింపు లభిస్తుంది. కంపెనీ వాషింగ్ మెషీన్ ప్రారంభ ధర రూ.7,299 అయితే మీరు దీన్ని రూ.6,990కి సేల్‌లో కొనోచ్చు.

స్మార్ట్ టీవీ ఆఫర్
ఈ సెల్‌లో అన్ని రకాల థామ్సన్ టీవీలను తక్కువ ధరకు కొనే అవకాశం కూడా ఉంది. మీరు సిటీ బ్యాంక్ లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే, మీకు 10% తగ్గింపు లభిస్తుంది. థామ్సన్ 42-అంగుళాల 42PATH2121 టి‌వి రూ. 14,999కి, 43-అంగుళాల 43PATH4545BL ధర రూ. 19,999గా ఉంది. కంపెనీ 50-అంగుళాల 50PATH1010BL మోడల్‌ను రూ.24,999కి లభిస్తుంది.

Blaupunkt టి‌విలు అండ్ వెస్టింగ్‌హౌస్ టీవీలపై ఆఫర్‌లు
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో, Blaupunkt 32CSA7101ని రూ. 9,999కి కొనుగోలు చేయవచ్చు, అయితే దీని ధర రూ. 11,999. కంపెనీ 40-అంగుళాల టీవీపై రూ. 2,000 తగ్గింపుతో రూ.15,999కి, Blaupunkt 43CSA7121 టి‌వి రూ.15,499కి అందుబాటులో ఉంది. కంపెనీకి చెందిన Blaupunkt 65QD7030 TVని రూ. 62,999కి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ సేల్ లో అమెరికన్ బ్రాండ్ వెస్టింగ్‌హౌస్ 24-అంగుళాల నాన్-స్మార్ట్ టీవీని రూ. 5,999కి కొనుగోలు చేయవచ్చు. 32-అంగుళాల ఆండ్రాయిడ్ HD రెడీ టీవీ రూ. 6,999కి, 32-అంగుళాల (WH32SP17) Pi సిరీస్ టీవీ రూ. 7,999కి అందుబాటులో ఉంది. కంపెనీకి చెందిన ఇతర టీవీ మోడళ్లపై కూడా డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.