జియో దెబ్బకి కస్టమర్లు అబ్బా..; ఇప్పుడు రీచార్జీలపై బాదుడే బాదుడు..

 ఇక జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలో భారీగా పెరుగుదల ఉండనుంది. 28 రోజుల 2GB డేటా ప్లాన్ ధర రూ.189, కాగా గతంలో రూ.155. అలాగే 1GB ప్లాన్‌ ధర రూ.209 నుండి రూ.249కి, 1.5 జీబీ డైలీ డేటా ప్లాన్ ధర రూ.239 నుంచి రూ.299కి, 2GB డైలీ ప్లాన్ ఇప్పుడు రూ.299 నుండి రూ.349కి పెరగనుంది. 

reliance jio rolls out new unlimited 5g data plans with tariff hike from July 3-sak

భారతదేశపు అతిపెద్ద టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఈ పెంపు ప్రభావం దేశంలోని లక్షల మంది జియో కస్టమర్లపై పడనుంది. కొత్త ధరల ప్రకారం ప్లాన్ల ధరలు రూ.600 వరకు ఉంటాయని సూచించింది. అయితే ఈ  రేట్లు జూలై 3 నుంచి అమలులోకి రానున్నాయి.

వచ్చే నెల జూలై నుండి జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలో భారీగా పెరుగుదల ఉండనుంది. 28 రోజుల 2GB డేటా ప్లాన్ ధర రూ.189, కాగా గతంలో రూ.155. అలాగే 1GB ప్లాన్‌ ధర రూ.209 నుండి రూ.249కి, 1.5 జీబీ డైలీ డేటా ప్లాన్ ధర రూ.239 నుంచి రూ.299కి, 2GB డైలీ ప్లాన్ ఇప్పుడు రూ.299 నుండి రూ.349కి పెరగనుంది. 

ఎక్కువ డేటా అవసరాలు ఉన్న యూజర్లు  అంటే 2.5GB డైలీ ప్లాన్‌ని సెలెక్ట్ చేసుకునే  వారికి ఈ ప్లాన్ ధర రూ. 349 నుండి రూ. 399కి, 3GB డైలీ డేటా  ప్లాన్ ధర రూ. 399 నుండి రూ. 449కి పెరుగనుంది. ఈ మార్పులు డేటా యూజర్లకు  ప్రతినెలా ఖర్చులలో అదనపు ఖర్చు  పెంపుకు  దారితీస్తాయి. 

ఇక రెండు నెలల ప్లాన్‌లకు కూడా ధరల పెంపు నుంచి మినహాయింపు లేదు. రెండు నెలలకు 1.5GB డైలీ డేటా  ప్లాన్ రూ. 479 ఉండగా  ఇప్పుడు రూ.579కి చేరింది. డైలీ 2జీబీ ప్లాన్ రూ.533 నుంచి రూ.629కి, అలాగే, మూడు నెలల 6GB డేటా ప్లాన్ రూ.395 నుండి రూ.479గా ఉండనుంది. 

reliance jio rolls out new unlimited 5g data plans with tariff hike from July 3-sak

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios