Jio New Plans: రెండు కొత్త ప్లాన్‌లను లాంచ్ చేసిన జియో.. బెనిఫిట్స్ ఇవే..!
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. సుదీర్ఘ వ్యాలిడిటీతో డేటా కావాలనుకునే యూజర్ల కోసం వీటిని ప్రవేశపెట్టింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్స్ కేటగిరీలో జియో కొత్తగా రూ.2,878, రూ.2,998 ప్లాన్‌లను తీసుకొచ్చింది.
ఐదేళ్లలోనే జియో టెలికాం రంగంలో పెను మార్పులు సృష్టించింది. టాప్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లకు బెనిఫిట్ కల్పించే జియో ఇప్పుడు మరో సరికొత్త రెండు ప్లాన్లను తీసుకొచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్స్ (Work From Home Plans) కేటగిరీలో జియో కొత్తగా రూ.2878, రూ.2998 ప్లాన్‌లను తీసుకొచ్చింది. కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లేకుండా వస్తున్న ఈ ప్లాన్లతో పాటు ప్రస్తుతమున్న బేస్ ప్లాన్‌కు అదనంగా డేటా కావాల్సిన వారు ఈ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. Work From Home Plans చేస్తున్న వారిని ఉద్దేశించి Jio వీటిని ప్రవేశపెట్టింది.
రూ. 2,878 ప్లాన్..!
డేటా కాల పరిమితి ఎక్కువ రోజులు కావాలనుకునే వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతి రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. 2జీబీ హైస్పీడ్ ఇంటర్‌నెట్ పూర్తి అయిన తర్వాత 64 కేబీపీఎస్ వేగంతో ఇంటర్‌నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ రీచార్జ్ ద్వారా ఎలాంటి ఎస్‌ఎంఎస్, కాల్స్ ప్రయోజనాలు లభించవు. ఈ లెక్కన యూజర్‌కు మొత్తం 730 జీబీ డేటా లభిస్తుంది.
రూ. 2,998 ప్లాన్ లాభాలు..!
ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటా అందిస్తారు. 2.5 జీబీ హైస్పీడ్ ఇంటర్‌నెట్ తర్వాత 64 కేబీపీఎస్ వేగంతో ఇంటర్‌నెట్ లభిస్తుంది. ఈ రీచార్జ్‌తో కూడా కేవలం ఇంటర్‌నెట్ మాత్రమే లభిస్తుంది. ఎలాంటి కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభించవు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారిని దృష్టిలో పెట్టుకొని రిలయన్స్ ఈ ఆఫర్లను ప్రకటించింది.
బేస్ ప్లాన్‌కు డైలీ డేటా బూస్ట్‌గా ఈ ప్లాన్‌లు ఉపయోగపడతాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ఈ ప్లాన్‌లు ఉపయోగపడేలా ఉన్నాయి. ఒకవేళ బేస్ ప్లాన్ వ్యాలిడిటీ ముగిసినా.. ఈ వర్క్‌ఫ్రమ్ ప్లాన్‌లు యాక్టివ్‌గానే ఉంటాయి. ఈ రెండు కొత్త ప్లాన్‌లు రిలయన్స్ జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మై జియో యాప్‌లో లిస్ట్ అయ్యాయి. కాగా జియో మరిన్ని వర్క్ ఫ్రమ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది.