ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోకి.. మరో టెలికాం కంపెనీ వొడాఫోన్ షాక్ ఇచ్చింది. పోటీగా వొడాఫోన్ తన సరికొత్త ప్రీ పెయిడ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందించనుంది. రూ.199 కే 2.8 జీబీ 4జీ డేటాతో జియోకు గట్టి పోటీనివ్వనుంది. రూ.198కే అపరిమిత కాల్స్‌తో పాటు ప్రతి రోజూ 2 జీబీ 4జీ డేటాను అందిస్తున్న జియో కు దీటుగా.. వొడాఫోన్ ఈ సరికొత్త ప్లాన్ రూపొందించింది. గతంలో 199 రూపాయలకు 28 రోజుల కాలపరిమితితో రోజుకు 1.4 జీబీ 4జీ డేటాను వొడాఫోన్ అందించింది.

 ఇప్పుడు అదే ధరకు రెట్టింపు సేవలు అందించనుంది. ఇప్పటికైతే ఈ ఆఫర్ అన్ని 4జీ సర్కిళ్లలోని వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ సర్కిళ్లలోని వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించకపోవటం నిరాశ కలిగించే అంశం. జియో తన 198 ఆఫర్ ను వెల్లడించిన తర్వాతే వొడాఫోన్ తన పాత ప్లాన్‌పై పునరాలోచించి ఈ నిర్ణయం తీసుకుంది.