రిలయన్స్ ఏజిఎం 2022: జియో 5జి పై కీలక ప్రకటన, గూగుల్ భాగస్వామ్యంతో చౌకైన 5జి ఫోన్..
ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ ఈరోజు జియో కస్టమర్ల సంఖ్య 421 మిలియన్లకు చేరుకుందని అన్నారు. జియో కస్టమర్లు ప్రతినెలా సగటున 20 జీబీ డేటాను ఉపయోగిస్తున్నారని, గత ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు అని చెప్పారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 45వ ఆన్యువల్ జనరల్ మీటింగ్ (AGM 2022) నేడు నిర్వహించారు. AGM 2022 వర్చువల్‌గా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆన్యువల్ జనరల్ మీటింగ్ ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో జరుగుతుంది. ఈ AGMలో జియో నెట్ వర్క్ ని 2016లో ప్రారంభించారు, నేడు జియో దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగా 400 మిలియన్లకు పైగా కస్టమర్లు అనుసరిస్తున్నారు. అయితే నేటి సమావేశంలోనూ పలు కీలక ప్రకటనలు వెలువడ్డాయి. రిలయన్స్ ఏజీఎం 2022 రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కీనోట్‌తో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ జియో యూట్యూబ్ ఛానెల్‌తో పాటు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.
కంపెనీ ప్రముఖ చిప్‌సెట్ తయారీ కంపెనీలు Qualcomm, Intel, Samsung, Meta, Nokia అండ్ Googleతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. Google భాగస్వామ్యంతో చౌకైన 5G ఫోన్‌ను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ ఈరోజు జియో కస్టమర్ల సంఖ్య 421 మిలియన్లకు చేరుకుందని అన్నారు. జియో కస్టమర్లు ప్రతినెలా సగటున 20 జీబీ డేటాను ఉపయోగిస్తున్నారని, గత ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు అని చెప్పారు. జియో ఫైబర్ 11,00,000 కి.మీ విస్తీర్ణంలో ఉంది. దేశంలోని ప్రతి ముగ్గురు వినియోగదారులలో ఇద్దరు జియో ఫైబర్‌ని ఉపయోగిస్తున్నారు. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ Jio 5G ఉత్తమంగా ఉంటుంది. అతి త్వరలో Jio 5G 100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభించనున్నారు. Jio 5G ద్వారా 10 కోట్ల ఇళ్లను స్మార్ట్‌గా మార్చేందుకు.
Jio స్టాండ్ అలోన్ 5Gని కూడా ప్రకటించింది. స్టాండ్ అలోన్ 5G అంటే Jio 5G కోసం 4G మౌలిక సదుపాయాలను ఉపయోగించదు. బెస్ట్ కవరేజ్ కోసం మొత్తం 22 టెలికాం సర్కిల్‌లలో ప్రీమియం 700 MHz బ్యాండ్‌లో 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన ఏకైక ఆపరేటర్ Jio. Jio 5G సర్వీస్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో దీపావళికి ప్రారంభించనుంది. జియో డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా 5Gని లాంచ్ చేస్తుంది.