ప్రముఖ కంపెనీ Redmi త్వరలో భారతదేశంలో  బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేయనుంది. ఈ ఫోన్   ఫిబ్రవరిలో భారతదేశంలో లాంచ్ చేసిన Redmi A3కి రీబ్యాడ్జ్డ్ వెర్షన్ అని కూడా నమ్ముతున్నారు.

స్మార్ట్ ఫోన్ తయారీ కంపెని షియోమీ రెడ్ మీ కొత్త ఫోన్ Redmi A3x త్వరలో భారతదేశంలోకి వస్తుందని భావిస్తున్నారు, అయితే ఈ Redmi హ్యాండ్‌సెట్ పేరు అండ్ లాంచ్ గురించి అధికారిక సమాచారాన్ని ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో భారతదేశంలో లాంచ్ చేసిన Redmi A3కి రీబ్యాడ్జ్డ్ వెర్షన్ అని కూడా నమ్ముతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రీబ్యాడ్జ్ అంటే ఏమిటి? 

రీబ్యాడ్జింగ్ లేదా రీబ్యాడ్జింగ్ అనేది ఇప్పటికే విడుదలైన ఫోన్‌ను చిన్న మార్పులతో వేరే పేరు లేదా బ్రాండ్‌తో తీసుకురావడం. 

 Redmi A3 భారతదేశంలో ఆక్టా-కోర్ MediaTek Helio G36 SoC, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష, 6.71-అంగుళాల 90Hz HD+ (1,600 x 700 పిక్సెల్‌లు) డిస్‌ప్లే, AI-బ్యాక్డ్ డ్యూయల్ 8-మెగాపిక్సెల్ కెమెరా యూనిట్‌తో తీసుకొచ్చారు. ఈ హ్యాండ్‌సెట్ 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో సపోర్ట్ ఇస్తుంది.

 భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న ఈ Redmi A3X మోడల్ కూడా అదే విధమైన స్పెసిఫికేషన్లతో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ షేప్‌లో పెద్దగా మార్పులేమీ ఉండకపోవడం గమనార్హం. Redmi A3 మిడ్‌నైట్ బ్లాక్, లేక్ బ్లూ ఇంకా ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. 

కాబట్టి ఈ కొత్త ఫోన్ కూడా ఇలాంటి కలర్ ఆప్షన్లలో వస్తుందని భావిస్తున్నారు. అదే విధంగా, రెడ్‌మి A3 భారతదేశంలో 3GB RAM + 64GB ROM మోడల్‌ ధర రూ. 7.299, 4GB RAM + 128GB ROM మోడల్‌ ధర రూ. 8,299 ఇంకా 6GB RAM + 128GB RAM మోడల్‌ ధర రూ. 9,299. కాబట్టి ఈ రాబోయే ఫోన్ కూడా 10,000 సెగ్మెంట్‌లో ఉంటుందని భావిస్తున్నారు.