ప్ర‌ముఖ‌ స్మార్ట్‌ఫోన్‌ మేకర్ షావోమీ వరుసగా ఫోన్లను భారత్‌లో విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. త్వరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 20వ తేదీన‌ ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. Redmi 10A ఫోన్‌ను ఏప్రిల్‌ 20న రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. 

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస‍్థ షావోమీ బడ్జెట్‌ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్ షావోమీ 10ఏను ఏప్రిల్ 20వ తేదీన భార‌త్‌ మార్కెట్‌లోకి విడుదల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. MediaTek Helio G25 ప్రాసెసర్‌, 13-megapixel కెమెరాతో పాటు ర్యామ్ బూస్ట‌ర్ ఫీచ‌ర్‌తో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. గత నెలలో ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. 

రెడ్ మీ 10ఏ ఫీచర్లు

రెడ్‌ మీ10ఏ స్మార్ట్‌ ఫోన్ 6.51 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 20:9 యాస్పెట్‌ రేషియోతో అందుబాటులోకి రానుంది. ఇందులో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వీడియోస్‌ను హైయ్యస్ట్‌ రెజెల్యూషన్‌తో వీడియోలు చూసేందుకు వైడ్‌వైన్‌ ఎల్‌1 సర్టిఫికెషన్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో డిస్ ప్లే డిజైన్‌ చేసింది. రెజెల్యూషన్ 720x1600 పిక్సెల్‌, ఆండ్రాయిడ్ ఓఎస్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 10డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, ఆక్టా-కోర్ MediaTek Helio G25 SoC, అలాగే 6GB వరకు RAM, 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు మైక్రో SD కార్డ్ (512GB వరకు) ద్వారా విస్తరణకు స‌పోర్ట్ చేయ‌నుంది. అయితే.. భార‌త్‌లో ప్రారంభించబోయే కాన్ఫిగరేషన్‌లపై అధికారిక సమాచారం లేదు.

ఇక ఫోటోగ్రఫీ విష‌యానికొస్తే.. Redmi 10A 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా సెన్సార్‌తో పాటు Xiaomi AI కెమెరా 5.0తో పాటు 27 సన్నివేశాలకు దృశ్య గుర్తింపును అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం హ్యాండ్‌సెట్ ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5, మైక్రో-USB పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. Redmi 10A ప్రామాణిక 10W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీ ఉంది.

రెడ్‌ మీ 10ఏ ధర (అంచ‌నా)

భారతదేశంలో Redmi 10A ధర రూ. 10 వేల‌లోపు నిర్ణయించబడుతుందని ఇటీవ‌ల‌ ఒక నివేదిక పేర్కొంది. ఈ ఫోన్ రెండు వేరియంట్ల‌లో అందుబాటులో ఉండ‌నుంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్‌లలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది బేస్ 4GB + 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం CNY 699 (దాదాపు రూ. 8,300) ప్రారంభ ధరతో గత నెలలో చైనాలో ప్రారంభించబడింది.