రియల్ మీ టెక్ లైఫ్ ఏ‌సి 1 టన్ను మోడల్ ధర రూ. 27,790, 1.5 టన్ను మోడల్ ధర రూ. 30,999. ఈ రెండు మోడల్స్ 4-స్టార్ రేటింగ్‌ను పొందాయి. ఈ ఏసీలో అల్ట్రా కూలింగ్ అనే ఫీచర్ ఉంది, ఈ ఫీచర్ గదిలో ఉన్న వ్యక్తులకు అనుగుణంగా గదిని చల్లబరుస్తుంది. 

రియల్ మీ టెక్ లైఫ్ ఇండియాలో కన్వర్టిబుల్ ఎయిర్ కండీషనర్‌ను విడుదల చేసింది. రియల్ మీ టెక్ లైఫ్ ఈ ఏ‌సి గురించి మాట్లాడుతూ 55 డిగ్రీల వేడిలో కూడా పని చేస్తుందని అలాగే గదిని చల్లగా ఉంచుతుందని పేర్కొంది. ఈ ఏసీలో అల్ట్రా కూలింగ్ అనే ఫీచర్ ఉంది, ఈ ఫీచర్ గదిలో ఉన్న వ్యక్తులకు అనుగుణంగా గదిని చల్లబరుస్తుంది. ఈ ఫీచర్‌తో పవర్ సేవింగ్ క్లెయిమ్ చేయబడింది.

రియల్ మీ టెక్ లైఫ్ నుండి వస్తున్న ఈ ఏ‌సిలో ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ కూడా ఉంది, ఈ కంప్రెసర్ ఫాస్ట్ కూలింగ్ అండ్ లాంగ్ లైఫ్ క్లెయిమ్ చేస్తుంది. ఈ ఏ‌సి గురించి మాట్లాడుతు దీనిలో ఒక ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్‌ ఉంది, ఈ ఫీచర్ దుమ్ము మొదలైనవాటిని ఫిల్టర్ చేస్తుంది. రియల్‌మీ టెక్‌లైఫ్ కింద విడుదల చేసిన తొలి ఏసీ కూడా ఇదే. ఇంతకుముందు కంపెనీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను విడుదల చేసింది.

రియల్ మీ టెక్ లైఫ్ ఏ‌సి
రియల్ మీ టెక్ లైఫ్ ఏ‌సి 1 టన్ను మోడల్ ధర రూ. 27,790, 1.5 టన్ను మోడల్ ధర రూ. 30,999. ఈ రెండు మోడల్స్ 4-స్టార్ రేటింగ్‌ పొందాయి. 5-స్టార్ రేటింగ్‌తో 1.5 టన్ను మోడల్ ధర రూ. 33,490. ఫ్లిప్‌కార్ట్ నుండి ఈ ఏ‌సిలను విక్రయించనుంది.

రియల్ మీ టెక్ లైఫ్ ఏ‌సి స్పెసిఫికేషన్లు
Realme TechLife నుండి వస్తున్న ఈ ఏ‌సిలో ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ ఉంది, ఇంకా లాంగ్ లైఫ్, ఫాస్ట్ కూలింగ్ క్లెయిమ్ చేసింది. ఈ ACతో డ్రై, ఎకో అండ్ మూడు స్లీప్ మోడ్‌లు ఉంటాయి. ఇంకా ప్రతి 30 సెకన్లకు ఆన్ చేసి, ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే ఆటో క్లీనింగ్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఏసీకి సంబంధించి గదిలో తేమ ఉండదని కంపెనీ పేర్కొంది. నీటి నుండి కాయిల్‌ను రక్షించే బ్లూ ఫిన్ టెక్నాలజీ కూడా ఉంది. ఇందులో పవర్ సేవింగ్స్ కోసం 40, 60, 80, 110 శాతం ఆప్షన్లు ఉంటాయి.