రియల్ మీ జి‌టి నియో 3 ఫుల్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లేను పొందుతుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz ఉంటుంది. ఫోన్‌తో మీడియాటెక్ డైమేన్సిటీ 8100 ప్రాసెసర్, 12జి‌బి ర్యామ్ తో 256జి‌బి వరకు స్టోరేజ్ లభిస్తుంది.

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ ఇండియాలో రియల్ మీ జి‌టి నియో 3 లాంచ్ ప్రకటించింది. రియల్ మీ జి‌టి నియో 3ని ఇండియాలో ఏప్రిల్ 29న ఆవిష్కరించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ కి 150W ఛార్జింగ్ లభిస్తుంది. అలాగే జి‌టి నియో 3 150w ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్రపంచంలోనే మొదటి ఫోన్ అవుతుంది. దీనిని భారతదేశంలో 80W ఛార్జింగ్ వేరియంట్‌తో కూడా ప్రారంభించవచ్చు.

ఫీచర్ల గురించి మాట్లాడితే రియల్ మీ జి‌టి నియో 3లో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌, డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz, ఫోన్‌తో MediaTek Dimensity 8100 ప్రాసెసర్, 12జి‌బి ర్యామ్ తో 256జి‌బి వరకు స్టోరేజ్ లభిస్తుంది.

కెమెరా విషయానికొస్తే రియల్ జి‌టి నియో 3కి మూడు బ్యాక్ కెమెరాలు ఉంటాయి, దీనిలో ప్రైమరీ లెన్స్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్‌గా ఉంటుంది. దీంతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ios) కూడా అందుబాటులోకి రానుంది. రెండవ లెన్స్ 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, మూడవ లెన్స్‌గా 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంటుంది. సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

రియల్ మీ జి‌టి నియో 3 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీని అందించారు. రెండవ వేరియంట్ 5000mAh బ్యాటరీని పొందుతుంది, దీనితో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు.

రియల్ మీ జి‌టి నియో 3 చైనాలో ప్రారంభ ధర 1,999 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 24,000 వద్ద ప్రారంభించారు. చైనాలో, Realme GT Neo 3ని పర్పుల్, గ్రే, సిల్వర్ రంగులలో ప్రవేశపెట్టరు.