Realme GT 2 Pro:గొప్ప డిజైన్‌తో నేడే ఫస్ట్ సేల్.. ధర, ఆఫర్లు, ఫీచర్ల తెలుసుకోండి..

ఈ ఫోన్ సేల్స్ ఫ్లిప్‌కార్ట్ నుండి ఈరోజు అంటే ఏప్రిల్ 14 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ కార్డ్ చెల్లింపులపై రూ.5,000 తగ్గింపు ఉంటుంది. 

Realme GT 2 Pro: The first sale of this phone with great design today, know the price and features

రియల్ మీ ఇండియా (Realme India) గత వారం మెగా ఈవెంట్‌లో రియల్ మీ జి‌టి2 (Realme GT 2) ప్రోని లాంచ్ చేసింది. ఈ ఏడాది జనవరిలో చైనాలో విడుదలైన ఈ ఫోన్ ఫిబ్రవరిలో యూరప్‌లో అందుబాటులోకి వచ్చింది. రియల్ మీ జి‌టి2 ప్రొ భారతదేశంలో ఈరోజు అంటే ఏప్రిల్ 14న మొదటి సేల్‌ నిర్వహిస్తుంది. ఈ ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే రియల్ మీ జి‌టి2 ప్రొ LTPO 2.0 సూపర్ రియాలిటీ డిస్‌ప్లేతో కూడిన స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ లభిస్తుంది. అంతేకాకుండా ఫోన్ వెనుక ప్యానెల్ బయో బేస్డ్ పేపర్ టెక్చర్ లాగా ఉంటుందని పేర్కొన్నారు.

రియల్ మీ జి‌టి2 ప్రొ ధర
రియల్ మీ జి‌టి2 ప్రొ 8జి‌బి ర్యామ్‌తో 128జి‌బి స్టోరేజ్ ధర రూ. 49,999, 256జి‌బి స్టోరేజ్‌తో 12జి‌బి ర్యామ్ ధర రూ. 57,999, అయితే లాంచింగ్ ఆఫర్ కింద, రెండు మోడల్‌లు మొదటి సేల్‌లో రూ. రూ. 44,999 ఇంకా రూ. 52,999. లో కొనుగోలు చేయవచ్చు Realme GT 2 Proని పేపర్ గ్రీన్, పేపర్ వైట్ అండ్ స్టీల్ బ్లాక్ కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సేల్స్ ఫ్లిప్‌కార్ట్ నుండి ఈరోజు అంటే ఏప్రిల్ 14 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ కార్డ్ చెల్లింపులపై రూ.5,000 తగ్గింపు ఉంటుంది. దీనితో, Realme Watch S ఉచితంగా లభిస్తుంది.

రియల్ మీ జి‌టి2 ప్రొ స్పెసిఫికేషన్‌లు
రియల్ మీ జి‌టి2ప్రొ Android 12 ఆధారిత Realme UI 3.0 ఉంది. Realme GT 2 Pro 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 2K LTPO AMOLED డిస్‌ప్లే, బ్రైట్ నెస్ 1,400 నిట్‌లు, దీని డిస్ప్లే డిస్ప్లేమేట్ నుండి A+ సర్టిఫికేట్ పొందింది. డిస్ప్లేలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంది. ఫోన్‌లో అధునాతన మ్యాట్రిక్స్ యాంటెన్నా సిస్టమ్ ఉంది, దీని ద్వారా మెరుగైన నెట్‌వర్క్, Wi-Fi 6, 5G, NFC కనెక్టివిటీని ఉందని పేర్కొంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్‌ ఇందులో  ఉంది, 12జి‌బి ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్ ఉంది.

  కెమెరా
ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, మొదటి లెన్స్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX 766 సెన్సార్. దీనితో పాటు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఇందులోని రెండవ లెన్స్ కూడా 50 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్. మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో. ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

రియల్ మీ జి‌టి2 బ్యాటరీ
కనెక్టివిటీ కోసం, ఫోన్ Wi-Fi 6, 5G, బ్లూటూత్ 5.2 మరియు NFCకి సపోర్ట్ చేనిస్తుంది. ఇంకా 65W ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ ఉంది. ఫోన్ బరువు 189 గ్రాములు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios