Asianet News TeluguAsianet News Telugu

లాంచ్‌కు ముందు రియల్ మీ కొత్త సిరీస్ ఫోన్ ఫీచర్లు.. ప్రపంచంలోనే మొట్టమొదటి టెక్నాలజీతో...

ఈ రియల్ మీ  ఫోన్‌తో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఓ‌ఎల్‌ఈ‌డి కర్వ్డ్ డిస్‌ప్లే ప్యానెల్,120 Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కర్వ్ డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలోనే అత్యంత సన్నని బెజెల్ డిజైన్ అని కంపెనీ పేర్కొంది. 

Realme 10 Pro+ 5G Features revealed before launch see photo and specification
Author
First Published Dec 3, 2022, 6:31 PM IST

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్ మీ ఇండియాలో కొత్త సిరీస్ ఫోన్ రియల్ మీ 10 ప్రొ ప్లస్ 5జిని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ డిసెంబర్ 8న ఇండియాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌తో పాటు, కంపెనీ రియల్ మీ 10 అండ్ రియల్ మీ 10 ప్రొని కూడా పరిచయం చేయబోతోంది. అయితే ప్రో ప్లస్ 5G ఫోన్‌ను లాంచ్ చేయడానికి ముందే కంపెనీ కొన్ని స్పెసిఫికేషన్‌ల గురించి సమాచారాన్ని అందించింది. ఈ ఫోన్ 120Hz కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz కర్వ్డ్ డిస్‌ప్లేతో  ప్రపంచంలోనే మొట్టమొదటి టెక్నాలజీ అని కంపెనీ పేర్కొంది.  

రియల్ మీ 10 ప్రొ ప్లస్ 5జి స్పెసిఫికేషన్లు
ఈ రియల్ మీ  ఫోన్‌తో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఓ‌ఎల్‌ఈ‌డి కర్వ్డ్ డిస్‌ప్లే ప్యానెల్,120 Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కర్వ్ డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలోనే అత్యంత సన్నని బెజెల్ డిజైన్ అని కంపెనీ పేర్కొంది. 

TUV Rheinland ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేట్‌ 
డిస్‌ప్లే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలలో 480Hz PWM డిమ్మింగ్ కూడా స్టాండర్డ్ గా ఉంటుందని కంపెనీ తెలిపింది, అయితే రియల్ మీ 10 ప్రొ+ 5జి 2160Hz PWM డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లేతో బిల్ట్ ఇన్ ఐ ప్రొటెక్షన్ అండ్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా  ఇచ్చారు.

TUV రైన్‌ల్యాండ్ ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేట్‌తో వచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఓ‌ఎల్‌ఈ‌డి డిస్‌ప్లే ఫోన్ రియల్ మీ 10 ప్రో+ 5G అని కంపెనీ తెలిపింది. మా కస్టమర్లు కంటికి అనుకూలమైన స్క్రీన్‌ కోరడంతో మేము రియల్ మీ 10 ప్రో+ 5Gలో కంటి రక్షణతో చాలా ముందుకు వచ్చాము.

హైపర్‌విజన్ మోడ్ 
ఫోన్‌తో పాటు హైపర్‌విజన్ మోడ్ వీడియో కలర్ బూస్ట్ అండ్ హెచ్‌డిఆర్ బూస్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది. హైపర్‌విజన్ మోడ్ ఆన్‌లో ఉన్నప్పుడు, వీడియోలను చూస్తున్నప్పుడు కలర్స్ మెరుగుపరచబడతాయి, తద్వారా వీడియో స్ట్రీమింగ్ ఎంటర్టైన్మెంట్ రెట్టింపు చేస్తుంది. 

కెమెరా అండ్ ప్రాసెసర్‌
మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో Mali-G68 GPU అండ్ స్టాండ్ ఆలోన్ 5G సపోర్ట్ లభిస్తుంది.  రియల్ మీ 10 ప్రొ ప్లస్  మూడు బ్యాక్ కెమెరాలు పొందుతుంది, దీని ప్రైమరీ లెన్స్ 108 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ అండ్ మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మోనోక్రోమ్.

ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.  5000mAh బ్యాటరీ అండ్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. X-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్ సపోర్ట్ కూడా ఫోన్‌లో ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios