Mobile Reviews: Poco X4 Pro మార్చి 28న Poco X4 Pro.. ధర ఎంతంటే..?
చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో భారత్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతోంది. మార్చి 28న పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వస్తోంది. మార్చి 28న అధికారికంగా Poco X4 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. పోకో కంపెనీ రాబోయే మిడిల్ రేంజ్ ఫోన్ లాంచ్ తేదీని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. Poco X4 Pro ఇటీవలే గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఇప్పుడు భారతీయ మార్కెట్లోకి కూడా Poco X4 Pro స్మార్ట్ ఫోన్ ఎంట్రీ ఇస్తోంది. ఈ డివైజ్ ఫీచర్లు ఇప్పటికే లీక్ అయ్యాయి. అయితే ఈ ఫోన్ ఫీచర్లు దేశంలో ఇటీవల లాంచ్ అయిన Redmi Note 11pro స్మార్ట్ ఫోన్ పోలి ఉంటాయి. Xiaomi, Poco ఫోన్‌లు దాదాపు ఒకే ధరతో పాటు ఒకే విధమైన ఫీచర్లతో రానుంది.
Poco X4 Pro ధర..!
రాబోయే Poco X4 ప్రో ధర సుమారు రూ. 20,000 వరకు ఉండవచ్చు, అంతకుముందు ఈ ఫోన్ ధర రూ. 18,999 ప్రారంభ ధరతో వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ Poco ఫోన్ EUR 299 (సుమారు రూ. 25,300)కి విక్రయిస్తోంది కంపెనీ. కానీ, భారత్‌లో ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. Xiaomi ఇప్పటికే Redmi Note 11 Proని రూ. 17,999కి అందిస్తోంది. రెండు డివైజ్‌లు దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. అందుకే ఈ డివైజ్ ఎక్కువ ధరకు లాంచ్ చేస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. రెండు ఫోన్‌ల మధ్య ఉన్న తేడా ఏంటంటే? Redmi ఫోన్‌లో అదనపు డెప్త్ సెన్సార్, వేరే చిప్‌సెట్ ఉంది. మిగిలిన స్పెసిఫికేషన్‌లు Redmi, Poco రెండింటిలోనూ ఒకే విధంగా ఉంటాయి. ఇటీవల పోకో కంపెనీ రిలీజ్ చేసిన టీజర్ కూడా రాబోయే Poco ఫోన్ Flipkart ద్వారా సేల్స్ మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.
సిఫికేషన్‌లు, ఫీచర్లు
Poco X4 Pro అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్‌లలో Poco X3 Pro ఒకటి.. ఈ ఫోన్ సక్సెసర్‌గా Poco X4 Pro మార్కెట్లోకి రాబోతోంది. ఈ డివైజ్ బడ్జెట్ ధరలో శక్తివంతమైన Qualcomm Snapdragon 860 చిప్‌సెట్‌తో ప్రారంభమైంది. చిప్ 2019 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు పవర్ సప్లయ్ కోసం స్నాప్‌డ్రాగన్ 855 SoC ద్వారా శక్తి అందుతుంది. Poco X4 ప్రో గ్లోబల్ మోడల్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 695 SoCని అందిస్తోంది. ర్యామ్‌ను 11GB వరకు విస్తరించుకునే అవకాశాన్ని ఇచ్చినట్టు కంపెనీ తెలిపింది.
Full-HD+ రిజల్యూషన్‌తో పనిచేసే 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ 1,200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ 120Hz, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. సింగిల్ పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంది. మిడిల్ రేంజ్ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేసే సాధారణ 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. 108-MP సెన్సార్, 8-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2-MP మాక్రో కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం Poco 16-MP కెమెరాను అందిస్తోంది.