15వేలలోపు బెస్ట్ ఫ్రెండ్లీ ఫోన్.. లాంచ్ చేసిన పోకో..
పోకో M6 5G భారతదేశంలో లావా స్టార్మ్ 5G, రెడ్ మీ12 5G, సాంసంగ్ గాలక్సీ M14 5G ఇంకా మరిన్నింటికి పోటీగా ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో ఇండియాలో Poco M6 5G పేరుతో బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 5,000 mAh బ్యాటరీ, 50MP కెమెరా, MediaTek Dimensity 6100+ చిప్‌సెట్, 90Hz డిస్‌ప్లే ఈ స్మార్ట్‌ఫోన్ హై లెట్ ఫీచర్స్. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది.
పోకో M6 5G భారతదేశంలో లావా స్టార్మ్ 5G, రెడ్ మీ12 5G, సాంసంగ్ గాలక్సీ M14 5G ఇంకా మరిన్నింటికి పోటీగా ఉంటుంది.
పోకో M6 5G ధర, సేల్ ఆఫర్‌లు
పోకో M6 భారతదేశంలో మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ చేసారు. 4 GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499, 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499.
కలర్స్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ గెలాక్టిక్ బ్లాక్ అండ్ ఓరియన్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో డిసెంబర్ 26న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించబడుతుంది. సేల్ ఆఫర్‌ల విషయానికొస్తే, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్‌లపై రూ. 1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందుతారు.
పోకో M6 స్పెసిఫికేషన్లు
పోకో M6 5G 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 600 nits పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. MediaTek డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో 8GB RAM, 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత MIUI 14 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది. పోకో రెండు ప్రైమరీ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు ఇంకా మూడు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను ఆషూర్ చేస్తుంది.
కెమెరా పరంగా, స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీల విషయానికొస్తే 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
పోకో M6 5G 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,000 mAh బ్యాటరీ ఉంది. స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ ఇంకా 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తుంది.