పోకో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. దీని ధర 10 వేల కంటే తక్కువే.. ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే..?
పోకో సి55 ధర రూ.9,499. ఈ ధర వద్ద 64జిబి స్టోరేజ్ 4జిబి ర్యామ్ లభిస్తుంది, అయితే 6 జిబి ర్యామ్ తో 128జిబి స్టోరేజ్ ధర రూ. 10,999. కూల్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ కలర్స్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో కొత్త బడ్జెట్ ఫోన్ పోకో సి55ని మంగళవారం ఇండియాలో విడుదల చేసింది. ఈ పోకో సి55 MediaTek Helio G85 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పరిచయం చేసారు. ఇంకా ఈ ఫోన్ పెద్ద HD ప్లస్ డిస్‌ప్లే,10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుతుంది.
పోకో సి55 ధర
పోకో సి55 ధర రూ.9,499. ఈ ధర వద్ద 64జిబి స్టోరేజ్ 4జిబి ర్యామ్ లభిస్తుంది, అయితే 6 జిబి ర్యామ్ తో 128జిబి స్టోరేజ్ ధర రూ. 10,999. కూల్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ కలర్స్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. పోకో సి55 ఫిబ్రవరి 28 నుండి అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌తో ఫోన్‌ను ప్రారంభ ధర రూ.8,499 వద్ద కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే టాప్ వేరియంట్ రూ.9,999కి అందుబాటులో ఉంటుంది.
పోకో సి55 స్పెసిఫికేషన్లు
పోకో సి55లో MIUI 13 ఉంది. అంతేకాకుండా MediaTek Helio G85 ప్రాసెసర్‌తో 6జిబి వరకు ర్యామ్, 128 జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఇచ్చారు. ఈ ఫోన్ కి 6.71-అంగుళాల HD + డిస్‌ప్లే ఉంది, దీని బ్రైట్‌నెస్ 534 నిట్స్ అండ్ రిఫ్రెష్ రేట్ 60Hz.
పోకో సి55 కెమెరా
కెమెరా విషయానికొస్తే, దీనిలో రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, వీటిలో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌లు, ఎపర్చరు f/1.8, రెండవ లెన్స్ గురించి కంపెనీ సమాచారం ఇవ్వలేదు. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. నైట్ సహా ఎన్నో మోడ్‌లు కెమెరాలో ఉంటాయి.
పోకో సి55 బ్యాటరీ
పోకో సి55కి బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అంతేకాకుండా, ఫోన్‌లో Wi-Fi, 4G, బ్లూటూత్ 5.1, GPS, మైక్రో USB పోర్ట్ ఉన్నాయి. 10W ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఉంది. వాటర్ రిసిస్టంట్ కోసం ఫోన్ IP52 రేటింగ్‌ను పొందింది.