Asianet News TeluguAsianet News Telugu

హోలీ ఆడుతున్నారా.. ఈ టిప్స్ తో మీ ఫోన్ అండ్ స్మార్ట్ వాచ్ సేఫ్ గా ఉంటుంది...

హోలీ ఆడుతున్నప్పుడు మీ ఫోన్ పొరపాటున తడిసిపోయినా లేదా పాకెట్ లోంచి బయటకు తీస్తున్నప్పుడు వాటర్  పడిన పొరపాటున కూడా ఛార్జింగ్‌ పెట్టకండి. దీని వల్ల ఫోన్ పాడవడంతో పాటు కరెంటు షాక్ కు గురయ్యే ప్రమాదం ఉంది.
 

playing holi with  colours your phone or smartwatch will not get damaged,  try these  5 tricks-sak
Author
First Published Mar 23, 2024, 12:34 PM IST

హోలీ సరదాలో మునిగిపోయాక  ఆలోచించాల్సిన పనిలేదు. కొంత మందికి హోలీ  ఆడిన తర్వాత ఫోన్ జేబులో పెట్టుకున్న సంగతి గుర్తొస్తుంటుంది. అలాంటప్పుడు  ఫోన్ పాడయ్యే అవకాశం ఎక్కువ. హోలీ రోజున ఫోన్‌లోకి నీరు, కలర్స్  వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా  కొంతమంది హోలీకి దూరంగా ఉంటారు, కానీ ఇప్పుడు ఆలా  జరగదు ఎందుకంటే  కొన్ని టిప్స్ పాటించడం  వల్ల  మీ ఫోన్ ని కాపాడుకోవచ్చు. మీ ఫోన్ కలర్స్ ఇంకా వాటర్  స్ప్లాష్‌ల మధ్య కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు  ఫోన్‌తో పాటు ఇతర గాడ్జెట్‌లు కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటాయి.  

1. వాటర్‌ప్రూఫ్ జిప్ లాక్ బ్యాగ్‌లు

హోలీ  సమయంలో కలర్స్ ఇంకా నీటి నుండి మీ ఫోన్‌ను రక్షించుకోవడానికి మీరు వాటర్‌ప్రూఫ్ జిప్ లాక్ బ్యాగ్‌ని ఉపయోగించవచ్చు. మీ ఫోన్‌ను కాపాడుకోవడానికి   బెస్ట్  మార్గం. ఈ బ్యాగ్‌లో మీ ఫోన్‌ను పెట్టడం ద్వారా మీరు మనశ్శాంతిగా హోలీ ఆడవచ్చు. టచ్‌స్క్రీన్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది, దీని ద్వారా ఫోన్ నుండి ఫోటోలు కూడా క్లిక్ చేయవచ్చు.

2. తడిసిన ఫోన్‌ను ఛార్జ్ చేయవద్దు

హోలీ ఆడుతున్నప్పుడు మీ ఫోన్ పొరపాటున తడిసిపోయినా లేదా జిప్ లాక్ బ్యాగ్‌లోంచి బయటకు తీస్తున్నప్పుడు అందులో నీరు చేరినా పొరపాటున కూడా ఛార్జింగ్‌  పెట్టకండి. దీని వల్ల ఫోన్ పాడవడంతో పాటు కరెంటు షాక్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలా చేయడం మానుకోండి.

3. ఫోన్‌ని ఇలా సీల్ చేయండి

హోలీ  ఆడటానికి  వెళ్లే ముందు మీరు మీ ఫోన్‌ను వాటర్‌ప్రూఫ్ జిప్ లాక్ బ్యాగ్‌లలో ఉంచుకుంటే, మరో పని  కూడా చేయండి. అదనపు జాగ్రత్తల కోసం USB పోర్ట్, హెడ్‌ఫోన్ లేదా స్పీకర్ వంటి ఫోన్ ఓపెన్ పోర్ట్‌లను టేప్‌తో పూర్తిగా సీల్ చేయండి. ఇది నీరు లేదా కలర్స్  లోపలి  భాగాలలోకి ప్రవేశించకుండా ఇంకా మీ హోలీ రంగులు పాడుచేయకుండా చేస్తుంది.

4. స్మార్ట్‌వాచ్‌ని ఇలా సేవ్ చేయండి

చాలా మంది స్మార్ట్‌వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్ ధరించి హోలీ ఆడుతుంటారు. ఇలా చేయడం వాళ్ళ పాడైపోయే అవకాశం పెరుగుతుంది. ఈ రోజుల్లో చాలా స్మార్ట్‌వాచ్‌లు లేదా ఫిట్‌నెస్ బ్యాండ్‌లు IP68 రేట్‌తో వస్తున్నాయని, అయితే అవి హోలీ సమయంలో ఒకోసారి పాడవుతాయి.  ఈ గాడ్జెట్‌లను సురక్షితంగా ఉంచడానికి రిస్ట్‌బ్యాండ్ కవర్‌లను ఉపయోగించవచ్చు. మీకు కావాలంటే, మీరు వాటిని ప్లాస్టిక్ బ్యాగులో కూడా ఉంచవచ్చు.

5. హోలీ సమయంలో ఇయర్‌బడ్‌లను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి

మీరు ఇయర్‌ఫోన్‌లు లేదా ఇయర్‌బడ్‌లు ధరించి హోలీ ఆడబోతున్నట్లయితే వాటికీ కలర్స్  మరకలు పడే ప్రమాదం లేదా పాడైపోయే ప్రమాదం ఉంది.  హోలీ రంగుల నుండి వారిని రక్షించడానికి గ్లిజరిన్ లేదా మాయిశ్చరైజర్ అప్లయ్ చేయండి. దీంతో హోలీ ఆడి ఇంటికి తిరిగొచ్చాక కలర్స్  శుభ్రం చేసుకోవడం చాలా సులభం అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios