ప్లేఫిట్ డయల్ అండ్ ప్లేఫిట్ ఎక్స్‌ఎల్‌  అనే 'మేడ్-ఇన్-ఇండియా' స్మార్ట్‌వాచ్‌లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. ఫిబ్రవరి 15 నుండి  22 వరకు వినియోగదారులు ఈ స్మార్ట్‌వాచ్‌లను ప్లేఫిట్ అధికారిక వెబ్‌సైట్ ఇంకా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు..

దేశీయ కంపెనీ ప్లేఫిట్ (playfit)రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు ప్లేఫిట్ డయల్ అండ్ ప్లేఫిట్ ఎక్స్‌ఎల్‌ను విడుదల చేసింది. వీటిలో ప్లేఫిట్ డయల్‌ బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ తో వస్తుంది. Playfit Dial అండ్ Playfit XL రెండూ చెమట, డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం IP67 అండ్ IP68 రేటింగ్‌లను పొందాయి. రెండింటిలోనూ ఎన్నో స్పోర్ట్స్ మోడ్‌లు ఇచ్చారు.

ప్లేఫిట్ డయల్ అండ్ ప్లేఫిట్ ఎక్స్‌ఎల్‌ ధర
ప్లేఫిట్ డయల్ ధర రూ. 3,999గా ఉండగా, దీనిని గోల్డ్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్లేఫిట్ ఎక్స్‌ఎల్‌ ని స్టీల్ గ్రే రంగులో రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు. రెండు వాచీలను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇంకా కంపెనీ సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.


ప్లేఫిట్ డయల్ అండ్ ప్లేఫిట్ ఎక్స్‌ఎల్ స్పెసిఫికేషన్‌లు
ప్లేఫిట్ డయల్ ఇంకా ప్లేఫిట్ ఎక్స్‌ఎల్ రెండూ స్క్వేర్ డయల్‌తో ఉంటాయి. ఈ రెండూ 240x280 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.75-అంగుళాల IPS డిస్‌ప్లేతో వస్తున్నాయి. రెండు స్క్రీన్‌లలో టచ్‌కు సపోర్ట్ ఉంది. స్క్రీన్‌కు సంబంధించి కఠినమైన సూర్యకాంతిలో కూడా డిస్‌ప్లే ప్రతి కోణం నుండి కనిపిస్తుంది.

ప్లేఫిట్ నుండి ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు నావిగేషన్ కోసం ఉపయోగించే సైడ్ మౌంటెడ్ బటన్‌లతో వస్తాయి. యాప్‌లో చాలా వాచ్ ఫేస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్లేఫిట్ డయల్ అండ్ ప్లేఫిట్ ఎక్స్‌ఎల్ లో మీరు ఇన్‌కమింగ్ కాల్‌లు, మెసేజులు, సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు చూడవచ్చు. వాచ్‌తో మీరు ఫోన్ కెమెరా అండ్ మ్యూజిక్ కూడా కంట్రోల్ చేయవచ్చు.

ప్లేఫిట్ డయల్‌లో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వి5, వాటర్ రెసిస్టెంట్ కోసం IP67 రేటింగ్ ఇచ్చారు. ప్లేఫిట్ ఎక్స్‌ఎల్ IP68 రేటింగ్‌ను పొందింది. ప్లేఫిట్ డయల్ అండ్ ప్లేఫిట్ XL వాచ్‌లు రెండింటిలోనూ హార్ట్ బీట్ ట్రాకింగ్ అండ్ స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్‌లు అందుబాటులో ఉంటాయి.

బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్ సెన్సార్ SpO2 ప్లేఫిట్ డయల్‌తో కూడా అందించారు, అయితే ఈ ఫీచర్ ప్లేఫిట్ XLలో లేదు. Playfit డయల్ 210mAh బ్యాటరీతో వస్తుంది, ఇంకా ఐదు రోజుల బ్యాకప్‌ ఉంటుందని క్లెయిమ్ చేయబడింది, అయితే Playfit XL 15 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ ఉంటుందని పేర్కొంది. మాగ్నెటిక్ ఛార్జర్‌ని ఉపయోగించి స్మార్ట్‌వాచ్ ని 120 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఛార్జ్ చేయవచ్చు.