గురకను కూడా ట్రాక్ చేసే ఫీచర్ తో ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ వాచ్.. ధర, ఫీచర్స్ వావ్..

ఒప్పో  వాచ్ ఫ్రీ దీర్ఘచతురస్రాకార 1.64-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. అంతేకాదు స్మార్ట్‌వాచ్ ఆమోలెడ్ డిస్‌ప్లేతో  పాటు మల్టిపుల్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్‌లు, 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Oppo Watch Free with AMOLED display launched in India, will track snoring too

చైనా కన్జ్యూమర్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ  ఒప్పో (Oppo)భారతీయ మార్కెట్లో  ఒప్పో వాచ్ ఫ్రీని విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ఒప్పో రెనో 7 5జి, రెనో 7 ప్రొ 5జితో తీసుకొచ్చింది. ఒప్పో వాచ్ ఫ్రీ AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీని బ్యాటరీకి సంబంధించి 14 రోజుల బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది. ఒప్పో వాచ్ ఫ్రీతో పాటు కంపెనీ ఒప్పో  ఎంకో ఎం32(Enco M32) ను కొత్త రంగులో  పరిచయం చేసింది. గతంలో ఈ నెక్‌బ్యాండ్ బ్లాక్ కలర్‌లో మార్కెట్‌లో ఉండేది. 

ఒప్పో వాచ్ ఫ్రీ ధర 
ఒప్పో వాచ్ ఫ్రీ ధర రూ. 5,999. దీనికి పోటీగా ఉన్న  డిజో (DIZO)వాచ్ ఆర్ ధర రూ. 3,499. ఒప్పో వాచ్ ఫ్రీని బ్లాక్ కలర్ వేరియంట్‌లో కొనుగోలు చేయవచ్చు. వాచ్ సేల్స్ తేదీకి సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఒప్పో ఎంకో ఎం32  గ్రీన్ కలర్ ని రూ. 1,799 ధర వద్ద  పరిచయం చేసారు, అయితే దీనిని ఫిబ్రవరి 9-11 మధ్య రూ. 1,499కి కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో వాచ్ ఫ్రీ స్పెసిఫికేషన్లు
ఒప్పో వాచ్ ఫ్రీ 280x456 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.64-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. డిస్ ప్లేలో 2.5D కర్వ్డ్ గ్లాస్ కూడా ఉంది. దీనిలో 230mAh బ్యాటరీ ఉంది, ఈ వాచ్ 75 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుందని అలాగే 14 రోజుల పాటు బ్యాకప్ ఉంటుందని పేర్కొన్నారు.

ఒప్పో వాచ్ ఫ్రీ క్రికెట్, బ్యాడ్మింటన్, స్కీయింగ్ మొదలైన 100 వర్కౌట్ మోడ్‌లతో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం 5ATM రేటింగ్ పొందింది. ఈ వాచ్ వాక్,  రన్ మొదలైనవాటిని ఆటోమేటిక్ గా గుర్తించగలదు. గేమింగ్ సమయంలో ఫోన్‌లో వచ్చే అన్ని నోటిఫికేషన్‌లు ఒప్పో వాచ్ ఫ్రీలో చూపిస్తుంది.

కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.0ని ఇచ్చారు. ఈ వాచ్‌ని అండ్రాయిడ్ కాకుండా iOSతో కూడా  ఉపయోగించవచ్చు. SpO2 సెన్సార్ కూడా వాచ్‌లో  ఉంది. ఈ వాచ్‌లో స్లీప్ ట్రాకింగ్‌తో పాటు గురకను కూడా ట్రాక్ చేసే ఫీచర్ ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios