Asianet News TeluguAsianet News Telugu

3డి గ్లాసెస్, సిమ్ కార్డ్ సపోర్ట్ తో ఒప్పో స్మార్ట్ వాచ్.. ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ కూడా..

ఈ సిరీస్‌లో ఒప్పో  వాచ్ 3కి  372x430 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.75-అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది. వాచ్‌తో పాటు 3డి గ్లాస్ కవర్ కూడా ఉంది. ఇంకా వాచ్ 3 ప్రోకి 1.91-అంగుళాల LTPO ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే  ఇచ్చారు.

Oppo Watch 3 Launched with 3D glasses and SIM card support will get Snapdragon processor
Author
Hyderabad, First Published Aug 11, 2022, 1:07 PM IST

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో(oppo) వాచ్ 3 సిరీస్ ని చైనాలో  లాంచ్ చేసింది. ఒప్పో వాచ్ 3 స్నాప్‌డ్రాగన్ W5 Gen 1 ప్రాసెసర్, 1 జి‌బి ర్యామ్ తో ప్రవేశపెట్టారు. ఒప్పో వాచ్ 3 సిరీస్ కింద ఒప్పో వాచ్ 3 అండ్ వాచ్  3 ప్రొ ఉన్నాయి. వాచ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో ఫైబర్‌గ్లాస్ కేస్ పొందుతుంది. ఈ సిరీస్‌లో ఒప్పో  వాచ్ 3కి  372x430 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.75-అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది. వాచ్‌తో పాటు 3డి గ్లాస్ కవర్ కూడా ఉంది. ఇంకా వాచ్ 3 ప్రోకి 1.91-అంగుళాల LTPO ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే  ఇచ్చారు.

ధర
ఒప్పో వాచ్ 3 ధర 1,599 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 18,800. ఈ ధర ప్లాటినం బ్లాక్ స్ట్రాప్ కోసం.  ఫెదర్ గోల్డ్ స్ట్రాప్‌తో కూడిన వేరియంట్ ధర 1,699 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 20,000. Oppo వాచ్ 3 ప్రో ప్రారంభ ధర 1,999 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 23,500. ఇండియాలో ఈ వాచ్‌ లాంచ్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి వార్తలు లేవు. ఈ రెండు వాచీలు ఆగస్టు 19 నుంచి చైనాలో విక్రయించనుంది.

ఒప్పో  వాచ్ 3  ప్రొ స్పెసిఫికేషన్లు
ఒప్పో  వాచ్ 3  ప్రొలో 378x496 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.91-అంగుళాల LTPO ఫుల్ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉంది. దీనితో సి-టైప్ 3డి గ్లాస్ కవర్ ఉంది. ఈ వాచ్ 1జి‌బి ర్యామ్, 32జి‌బి స్టోరేజ్ తో Snapdragon W5 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. SpO2, ECG, యాంబియంట్ లైట్ ఎయిర్ ప్రెజర్ సెన్సార్ వాచ్‌తో అందించారు. వాటర్ రెసిస్టెంట్ కోసం ఈ వాచ్ 5 ATM రేట్ చేయబడింది.

ఇంకా ఈ వాచ్ eSIMకి కూడా  సపోర్ట్ చేస్తుంది. వాచ్ బ్లూటూత్ v5, NFCతో పాటు GPS ఇంకా GLONASSకి కూడా సపోర్ట్ చేస్తుంది. దీనిలో 550mAh బ్యాటరీ ఉంది, ఇంకా 5 రోజుల బ్యాకప్  ఉంటుందని పేర్కొంది. లైట్ మోడ్‌లో బ్యాటరీ బ్యాకప్   15 రోజుల పాటు ఉంటుంది. ఒప్పో  వాచ్ 3 Proని కేవలం 65 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. వాచ్ ఫ్రేమ్ అల్యూమినియంతో తయారు చేయబడింది  ఇంకా 37.5 గ్రాముల బరువు ఉంటుంది.

Oppo వాచ్ 3 స్పెసిఫికేషన్లు
Oppo Watch 3 ఫీచర్ల గురించి మాట్లాడితే ప్రో మోడల్‌లో ఉన్న అదే ప్రాసెసర్‌ ఇచ్చారు. అంతేకాకుండా  మెటల్ ఫ్రేమ్‌ కూడా ఉంది. ఈ వాచ్‌తో NFCకి కూడా సపోర్ట్ ఉంటుంది. Oppo Watch 3 372x430 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.75-అంగుళాల AMOLED డిస్‌ప్లే, వాటర్ రెసిస్టెంట్ కోసం వాచ్ 5 ATM రేట్ చేయబడింది ఇంకా GPSతో GLONASSతో వస్తుంది.

Oppo వాచ్ 3లోని 400mAh బ్యాటరీ 4 రోజుల క్లెయిమ్ బ్యాకప్‌ ఉంటుంది.  ఇంకా కాల్స్ చేయడానికి LTE సపోర్ట్ కూడా ఉంది. లైట్ మోడ్‌లో Oppo Watch 3 బ్యాటరీకి సంబంధించి 10 రోజుల బ్యాకప్ క్లెయిమ్ ఉంది. ఈ వాచ్‌ను 60 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios