Asianet News TeluguAsianet News Telugu

Oppo Reno 7 5G: ఒప్పో నుంచి రెండు 7 సిరీస్​ ఫోన్లు.. లీకైన ఫీచ‌ర్లు..!

ప్రముఖ స్మార్ట్​ఫోన్(Smartphone)​ తయారీ సంస్థ ఒప్పో (Oppo) నుంచి త్వరలోనే ఒప్పో రెనో 7 (Oppo Reno 7) కొత్త సిరీస్​ ఫోన్లు మార్కెట్​లోకి రానున్నాయి. తాజాగా వీటి లాంచింగ్​ను ఆ సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. 

Oppo Reno 7 5G India launch confirmed
Author
Hyderabad, First Published Jan 22, 2022, 2:44 PM IST

ప్రముఖ స్మార్ట్​ఫోన్(Smartphone)​ తయారీ సంస్థ ఒప్పో (Oppo) నుంచి త్వరలోనే ఒప్పో రెనో 7 (Oppo Reno 7) కొత్త సిరీస్​ ఫోన్లు మార్కెట్​లోకి రానున్నాయి. తాజాగా వీటి లాంచింగ్​ను ఆ సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. ఒప్పో తన అధికారిక వెబ్‌సైట్‌లో (Website) ఒప్పో రెనో 7 సిరీస్‌ను టీజ్ చేసింది. అయితే ఈ సిరీస్​ లాంచింగ్​ తేదీ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ సిరీస్​ కింద ఒప్పో రెనో 7 5జీ (Oppo Reno 7 Five G), ఒప్పో రెనో 7SE 5G, ఒప్పో రెనో 7 ప్రో 5G స్మార్ట్​ఫోన్లు భారత మార్కెట్​లోకి రానున్నాయి. ఇప్పటికే ఇవి చైనా మార్కెట్​లోకి లాంచ్​ అయ్యాయి. కొన్ని ప్రత్యేక ఎడిషన్ హ్యాండ్‌సెట్‌లతో పాటు ఒప్పో సంస్థ వీటిని గతేడాది చైనాలో ఆవిష్కరించింది. అక్కడ మంచి స్పందన రావడంతో అతి పెద్ద మొబైల్​ మార్కెట్​గా ఉన్న భారత్​లో లాంచ్​ చేసేందుకు ఒప్పో సిద్దమవుతోంది. అయితే, భారత్​లో ఖచ్చితమైన లాంచింగ్​ డేట్​, ధర, స్పెసిఫికేషన్ల వివరాలపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

గత నెలలో ఒప్పో రెనో 7 సిరీస్​ ధర ఆన్​లైన్​లో లీకైంది. దీన్ని బట్టి చూస్తే.. ఒప్పో రెనో 7 5జీ ఫోన్​ ధర రూ. 28 వేల నుంచి రూ. 31 వేల వరకు ఉండనుంది. అలాగే, ఒప్పో రెనో 7 ప్రో 5జీ ఫోన్​ రూ. 41 వేల నుంచి రూ. 43 వేల వరకు ఉండనుంది. ఈ ఫోన్లు తొలుత ఫ్లిప్​కార్ట్​ ద్వారా అమ్మకానికి రానున్నాయి. చైనాలో ఇప్పటికే ఒప్పో రెనో 7 5G స్మార్ట్​ఫోన్లు విడుదలయ్యాయి. ఇవే ఫీచర్లతో భారత్​లోనూ వీటిని విడుదల చేసేందుకు కంపెనీ సిద్దమవుతోంది. ఒప్పో రెనో 7 5జీ ఫోన్​ క్వాల్​కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. మరోవైపు, ఒప్పో రెనో 7ప్రో మోడల్‌ మీడియా టెక్​ డైమెన్సిటీ 1200- మాక్స్​ SoC ప్రాసెసర్​ ఉండనుంది.

ఒప్పో రెనో 7 5జీ స్మార్ట్​ఫోన్​ ప్రపంచంలోనే మొట్టమొదటి సోనీ IMX709 అల్ట్రా-సెన్సింగ్ సెన్సార్​ కెమెరాతో వస్తుంది. ఈ కెమెరా 32-మెగాపిక్సెల్ రిజల్యూషన్​ కలిగి ఉంటుంది. ఇక దీనిలో 1/1.56 అంగుళాల ఫ్లాగ్‌షిప్ సోనీ IMX766 సెన్సార్ కెమెరాను కూడా అందించనుంది. ఇది 50-మెగాపిక్సెల్​ రిజల్యూషన్​తో వస్తుంది. ఈ సెన్సార్లు ఒప్పో రెనో 7 ప్రోలో కూడా అందించనుంది. చైనాలో ఒప్పో రెనో 7 సిరీస్ లాంచ్ సందర్భంగా, కంపెనీ ఒప్పో రెనో 7 5G న్యూ ఇయర్ ఎడిషన్‌ను కూడా లాంచ్​ చేసింది. దీనితో పాటు ఒప్పో రెనో 7 ప్రో లీగ్ ఆఫ్ లెజెండ్స్ ఎడిషన్‌ను కూడా ఆవిష్కరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios