Asianet News TeluguAsianet News Telugu

ఐఫోన్ ఫీచర్స్ తో వన్ ప్లస్ కొత్త సిరీస్.. ధర, లాంచ్ వివరాలు తెలుసా..

 వన్ ప్లస్ 11R అనేది  వన్ ప్లస్ Ace 2 రీబ్రాండెడ్ వెర్షన్ కాబట్టి,  వన్ ప్లస్ 12R 5G జనవరి 4న చైనాలో విడుదల కానున్న  వన్ ప్లస్ Ace 3కి  రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు.
 

OnePlus 12 and OnePlus 12R set to launch in India on January 23: Expected price specs more here-sak
Author
First Published Dec 29, 2023, 11:48 AM IST

కన్సూమర్ ఎలక్ట్ట్రానిక్స్  కంపెనీ  వన్ ప్లస్  12 సిరీస్ జనవరి 23న ఇండియలో  లాంచ్  కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో  వన్ ప్లస్12 5G అండ్   వన్ ప్లస్12R 5G ఉంటాయి. కొత్తగా లాంచ్ చేసిన  ఐకూ(iQOO)  12 5G లానే OnePlus 12 స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా, iQOO 12 5G భారతదేశంలో రూ. 52,999 ప్రారంభ ధరతో ప్రవేశపెట్టారు.

 వన్ ప్లస్ 11R అనేది  వన్ ప్లస్ Ace 2 రీబ్రాండెడ్ వెర్షన్ కాబట్టి,  వన్ ప్లస్ 12R 5G జనవరి 4న చైనాలో విడుదల కానున్న  వన్ ప్లస్ Ace 3కి  రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు.

వన్ ప్లస్ 12 5G, వన్ ప్లస్ 12R ఇండియా ధర లీక్
టిప్‌స్టర ప్రకారం, OnePlus 12 ప్రారంభ ధరను రూ. 58,000 నుండి రూ. 60,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా, OnePlus 11 5G భారతదేశంలో ఈ సంవత్సరంలో రూ. 56,999 ప్రారంభ ధరతో ప్రారంభించారు. కలర్స్ పరంగా, OnePlus 12 ఫ్లోవీ ఎమరాల్డ్ కలర్ అప్షన్ లో అందుబాటులో ఉంటుంది. 

వన్ ప్లస్ 12R 5G ధర విషయానికొస్తే, దీని ధర రూ. 40,000 నుండి రూ. 42,000 వరకు ఉండవచ్చు. వన్ ప్లస్ 12R రెండు కలర్స్ అప్షన్స్ లో లభిస్తుంది: కూల్ బ్లూ అండ్ ఐరన్ గ్రే.

OnePlus 12 5G స్పెసిఫికేషన్లు..  

చైనాలో ప్రారంభించబడిన వేరియంట్ ప్రకారం, OnePlus 12 5G 6.82-అంగుళాల క్వాడ్-HD+ LTPO OLED స్క్రీన్‌ ఉంటుంది, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.  స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ ద్వారా అందించబడుతుందని తెలిపింది. గరిష్టంగా 24GB RAM ఇంకా 1TB వరకు ఇంటర్నల్  స్టోరేజ్ అందించవచ్చు.

కెమెరా పరంగా, OnePlus 12లో 50MP సోనీ LYT-808 ప్రైమరీ లెన్స్, 64MP టెలిఫోటో కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ వంటి హాసెల్‌బ్లాడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రావచ్చు. వన్ ప్లస్ 12 5G 100W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,400 mAh బ్యాటరీ ఉంటుందని భావిస్తున్నారు.

OnePlus 12R 5G  స్పెసిఫికేషన్లు.. 

ఈ స్మార్ట్‌ఫోన్ గురించి వివరాలు ఇంకా పూర్తిగా  వెల్లడించలేదు. టిప్‌స్టర్ ప్రకారం, OnePlus 12R స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. గరిష్టంగా 16 GB RAM ఇంకా 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్  అందిస్తుంది. OnePlus 12R రెండు కలర్స్  అప్షన్స్ ఇంకా ట్రిపుల్ కెమెరా లెన్స్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. ఫోన్‌కి OnePlus 12 లాగానే  గుండ్రటి కెమెరా  ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios