OnePlus 10 Pro launch:నేడే వన్ ప్లస్ 10 ప్రో లాంచ్.. ధర, ఫీచర్స్, లైవ్ ఈవెంట్ ఎలా చూడొచ్చంటే..?

వన్ ప్లస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఈరోజు విడుదల చేయబోతోంది. ఇందుకోసం నేడు సాయంత్రం వన్‌ప్లస్ 10 ప్రో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఇంకా ఈ లైవ్ ఈవెంట్‌ను ప్రతిఒక్కరూ ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

OnePlus 10 Pro launches today: How to watch livestream of OnePlus 10 Pro launch event, time, and what to expect

ఈరోజు సాయంత్రం వన్‌ప్లస్ 10 ప్రోని ఈవెంట్‌లో లాంచ్ చేయబోతుంది. ఈ లైవ్ యూట్యూబ్‌లో అలాగే వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వన్ ప్లస్ ఈ  లాంచ్  సంబంధించి OnePlus 10 ప్రో కంపెనీకి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా ఉండబోతోంది. అలాగే కంపెనీ మరో రెండు ఉత్పత్తులను ఈ ఈవెంట్‌ ద్వారా పరిచయం చేయనుంది.

ఇప్పటికే ఎన్నో లీక్‌లు, అలాగే OnePlus నుండి కొన్ని అధికారిక ప్రకటనలు వెల్లడైనందున OnePlus 10 ప్రో గురించి ఇప్పటికే చాలా మందికి తెలుసు. అయితే చిరకాల వన్‌ప్లస్ అభిమానులు భారతదేశంలో చాలా మంది ఉన్నారు. OnePlus 10 ప్రో లాంచ్ ఈవెంట్‌ను ఎలా చూడాలంటే.. 

ఒకటి అధికారిక OnePlus ఇండియా వెబ్‌సైట్. మరొకటి  అధికారిక OnePlus లేదా OnePlus ఇండియా YouTube ఛానెల్. ఈ ప్రత్యక్ష ప్రసారం మార్చి 31న భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది, అంటే ఈరోజు సాయంత్రం. లాంచ్ ఈవెంట్‌లో ఏమి ఆశించాలో, మీరు ఆశించాల్సిన మూడు ఉత్పత్తులు ఉన్నాయి.

ఈ ఈవెంట్  ప్రధాన ఆకర్షణ OnePlus 10 Pro. అంటే OnePlus నుండి ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఫోన్. ఈ ఫోన్  Samsung Galaxy S22+, iPhone 13 వంటి వాటికి పోటీగా ఉంటుంది. హై-ఎండ్  కోసం చూస్తున్న షాపర్‌లకు భారతదేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ లో OnePlus 10 ప్రో ఒకటిగా ఉంటుందని  ఆశిస్తున్నాము అని తెలిపారు.  

 ఫోన్‌తో పాటు, OnePlus OnePlus 10 ప్రో లాంచ్ ఈవెంట్‌లో OnePlus Bullets Wireless Z2 ఇయర్‌ఫోన్‌లను కూడా లాంచ్ చేయబోతోంది. ఈ ఇయర్‌ఫోన్‌లు నెక్‌బ్యాండ్ స్టైల్‌ను ఉపయోగిస్తాయి ఇంకా  సరసమైనవిగా ఉంటాయి.

OnePlus 10 Pro లాంచ్ ఈవెంట్‌లో మీరు చూడాలనుకుంటున్న చివరి ఉత్పత్తి TWS ఇయర్‌ఫోన్‌లు అయిన OnePlus బడ్స్ ప్రో సిల్వర్ వేరియంట్. ఈ బడ్‌లు సాధారణ కలర్ వేరియంట్‌ ధరతో సమానంగా వీటి ధర ఉంటుందని అంచనా.

OnePlus 10 ప్రో ఇండియా ధర
OnePlus 10 Pro గురించి చాలా వివరాలు తెలిసినప్పటికీ,  Qualcomm Snapdragon 8 Gen 1 ద్వారా అందించబడుతుందని,  కానీ ధర వివరాలు లాంచ్‌కు ముందు కొంతవరకు అస్పష్టంగానే ఉన్నాయి.

ఈరోజు సాయంత్రం లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 10 ప్రో  భారతదేశ ధరను తెలుసుకోవచ్చు, అయితే ప్రస్తుతానికి ఊహించినట్లయితే, వన్‌ప్లస్ 9 ప్రో లాగానే ఉండబోతోందని  భావించవచ్చు. దీని ఆర్థం భారతదేశంలో OnePlus 10 ప్రో  బేస్ వేరియంట్ ధర రూ. 60,000 నుండి రూ. 65,000 వరకు ఉంటుందని అంచనా. ఏది ఏమైనప్పటికీ దీని ధర మీ ఊహకు అందదు, OnePlus 10 Pro ప్రత్యేక ఫీచర్స్, ప్రత్యేకించి  కెమెరా, టాప్ స్పెక్స్ కారణంగా మంచి ధర ఫోన్‌గా ఉండొచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios