ఫోన్‌కు బదులుగా స్మార్ట్‌వాచ్ ద్వారా పేమెంట్స్.. ఎయిర్‌టెల్ కూల్ ఫీచర్.. చాల స్పెషల్ కూడా..
ఇప్పుడు మీరు డబ్బు చెల్లింపుల కోసం మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదా మీ ఫోన్‌ని మళ్లీ మళ్లీ పాకెట్ నుండి తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు స్మార్ట్ వాచ్ ద్వారా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయవచ్చు.
కొన్నేళ్ల క్రితం వరకు పేమెంట్స్ కోసం క్యాష్ ఉపయోగించేవారు. ఇప్పుడు నగదుతో పాటు కార్డు, డిజిటల్ పద్ధతుల్లో పేమెంట్స్ చేస్తున్నారు. డిజిటలైజేషన్ యుగంలో పేమెంట్స్ చేయడానికి మరిన్ని పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ ఒక స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్‌తో టైం లేదా ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయడంతో పాటు మీరు పేమెంట్స్ కూడా చేయగలుగుతారు. కస్టమర్లకు పేమెంట్స్ సులభతరం చేయడానికి, Airtel Payments Bank ఈ Smartwatchని ప్రారంభించినట్లు ప్రకటించింది. దీని సహాయంతో కస్టమర్లు కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేయవచ్చు.
ఎయిర్‌టెల్ పేమెంట్ స్మార్ట్‌వాచ్
Noise బ్రాండ్ Airtel Payments Bank అండ్ MasterCardతో పాట్నర్ షిప్ చేసుకుంది . ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్ వాచ్‌లో ట్యాప్ చేసి పేమెంట్ చేసే అప్షన్ వినియోగదారులు పొందుతున్నారు. దీని సహాయంతో రూ.1 నుండి రూ.25 వేల వరకు పేమెంట్స్ చేయవచ్చు. దీనికి మాస్టర్ కార్డ్ నెట్‌వర్క్ సపోర్ట్ గల NFC చిప్ కూడా ఉంది.
నాయిస్ అండ్ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ స్మార్ట్‌వాచ్‌లో వినియోగదారులు థాంక్స్ యాప్ ద్వారా సేవింగ్స్ అకౌంట్ కు కనెక్ట్ చేయగలుగుతారు.
స్మార్ట్ వాచ్ అద్భుతమైన ఫీచర్లు
ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.85 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 550 నిట్‌ల పీక్ బ్రైట్ నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్‌లో హార్ట్ రేట్ మానిటర్, సెన్సార్, స్లీప్‌లెస్ ట్రాకర్, మెన్‌స్ట్రువల్ సైకిల్ మానిటర్ అలాగే 130 స్పోర్ట్స్ మోడ్‌లు అందించబడ్డాయి. ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఇంకా సింగిల్ ఛార్జ్‌పై 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. దీనికి IP68 రేటింగ్ కూడా ఉంది, వాటర్ అండ్ డస్ట్ నుండి రక్షించే సామర్ధ్యం ఉంది.
స్మార్ట్ వాచ్ ధర అండ్ కలర్ అప్షన్స్
ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.2,999. ఇందులో మీరు మూడు అప్షన్స్ ఉంటాయి. నలుపు, బూడిద ఇంకా నీలం రంగులు ఉంటాయి.