Asianet News TeluguAsianet News Telugu

Nothing Phone 1: లాంచ్ తరువాత ఒక నెలలో కస్టమర్లకు షాక్ ఇచ్చిన కంపెనీ.. ఏంటంటే..?

ఈ ఫోన్ లాంచ్‌తో నిరంతరం వివాదాలలో నిలిచింది. రెండు అప్‌డేట్‌ల తర్వాత కూడా నథింగ్ ఫోన్ 1 యూజర్లు ఇప్పటికీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా లాంచ్ తరువాత కేవలం ఒక నెలలోనే కంపెనీ నథింగ్ ఫోన్ 1ని ధర పెంచేసింది. 

Nothing Phone 1: Within a month, the company gave a shock, made the phone expensive
Author
Hyderabad, First Published Aug 18, 2022, 1:12 PM IST

గత నెలలో  నథింగ్ ఫోన్ 1 ఇండియాలో అయ్యింది. జూలై 21న నథింగ్ ఫోన్ 1  ఫస్ట్ సేల్స్ మొదలయ్యాయి. అయితే ఈ ఫోన్ లాంచ్‌తో నిరంతరం వివాదాలలో నిలిచింది. రెండు అప్‌డేట్‌ల తర్వాత కూడా నథింగ్ ఫోన్ 1 యూజర్లు ఇప్పటికీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా లాంచ్ తరువాత కేవలం ఒక నెలలోనే కంపెనీ నథింగ్ ఫోన్ 1ని ధర పెంచేసింది. నథింగ్ ఫోన్ కంపెనీని 2022లో ప్రారంభించారు. దీని వ్యవస్థాపకుడు వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ. నథింగ్ ఫోన్ 1 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల OLED డిస్‌ప్లే  ఉంది. నథింగ్ ఫోన్ 1 అతిపెద్ద ఫీచర్  దానిలో ఇచ్చిన గ్లిఫ్ లైట్. ఫోన్  కొత్త ధర అండ్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం...

నథింగ్ ఫోన్ 1 కొత్త ధర 
నథింగ్ ఫోన్ 1  8 GB ర్యామ్‌తో 128 GB స్టోరేజ్ ధర ఇంతకుముందు రూ. 32,999 నుండి ఇప్పుడు రూ. 33,999కి పెరిగింది. 8 జీబీ ర్యామ్‌తో కూడిన 256 జీబీ స్టోరేజ్ ధర ఇప్పుడు రూ. 36,999 అండ్ 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 39,999 అంటే అన్ని మోడల్స్ ధర రూ. 1,000 పెరిగింది.

నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్స్ 
ఆండ్రాయిడ్ 12 నథింగ్ ఫోన్ 1తో అందించారు. అంతేకాకుండా 6.55-అంగుళాల పూర్తి HD ప్లస్ OLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్ ప్లే అండ్ బ్యాక్ ప్యానెల్‌పై గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. డిస్ప్లేతో HDR10+కి సపోర్ట్ ఉంది ఇంకా బ్రైట్‌నెస్ 1200 నిట్స్. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 778G+ ప్రాసెసర్ 12జి‌బి వరకు LPDDR5 ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్ ఉంది.

నథింగ్ ఫోన్ 1 కెమెరా 
నథింగ్ ఫోన్ 1లో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి, 50-మెగాపిక్సెల్ లెన్స్ సోనీ IMX766 సెన్సార్‌తో  అపెర్చర్ /1.88 అండ్ OIS ఇంకా EIS రెండింటికీ సపోర్ట్ ఉంది. రెండవ లెన్స్ కూడా 50-మెగాపిక్సెల్ Samsung JN1 సెన్సార్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్. దీంతో ఈఐఎస్ స్టెబిలైజేషన్ అందుబాటులోకి రానుంది. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సోనీ IMX471 కెమెరా ఇచ్చారు. పనోరమా నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, ఎక్స్‌పర్ట్ మోడ్ కెమెరాతో అందుబాటులో ఉంటాయి.

నథింగ్ ఫోన్ 1  బ్యాటరీ
కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో 5G, 4G LTE, Wi-Fi 6, Wi-Fi 6 డైరెక్ట్, బ్లూటూత్ v5.2, NFC, GPS/ A-GPS, GLONASS, GALILEO, QZSS అండ్ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. నథింగ్ ఫోన్ 1 5W రివర్స్ ఛార్జింగ్‌తో పాటు 33W వైర్ ఛార్జింగ్ ఇంకా 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ ఫోన్ IP53 రేటింగ్‌ పొందింది. ఇంకా మూడేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను ఇంకా నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios