చిక్కుల్లో నథింగ్ ఫోన్ 1.. సమస్యలు ఒకదాని తర్వాత మరోకటి.. యూజర్ల ఫిర్యాదు..
వినియోగదారుల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లో ఆకుపచ్చ రంగు లైన్ కనిపిస్తుందని చాలా మంది ట్విట్టర్‌లో ఒక చిన్న వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేశారు. ఈ ఫోన్‌ను రీప్లేస్ చేస్తామని కంపెనీ చెప్పినప్పటికి చాలా మందికి రీప్లేస్‌మెంట్ చేసిన ఫోన్‌లో కూడా ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
నథింగ్ ఫోన్ 1 మార్కెట్లోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా నిరంతరం చర్చలో నిలుస్తుంది. నథింగ్ ఫోన్ 1 పై ఎదుర్కొంటున్న సమస్యల గురించి యూజర్లు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. వినియోగదారుల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లో ఆకుపచ్చ రంగు లైన్ కనిపిస్తుందని చాలా మంది ట్విట్టర్‌లో ఒక చిన్న వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేశారు. ఈ ఫోన్‌ను రీప్లేస్ చేస్తామని కంపెనీ చెప్పినప్పటికి చాలా మందికి రీప్లేస్‌మెంట్ చేసిన ఫోన్‌లో కూడా ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
Reddit ద్వారా కూడా ఫిర్యాదులు
ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియో క్లిప్ ప్రకారం నథింగ్ ఫోన్ 1 స్క్రీన్ ఆకుపచ్చ కలర్ చూపుతోంది. రీప్లేస్‌మెంట్ ద్వారా అందిన ఫోన్ లో ఫ్రంట్ కెమెరా దగ్గర స్క్రీన్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌తో పాటు చాలా మంది రెడ్డిట్‌లో నథింగ్ ఫోన్ 1లో లోపం గురించి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యలను కంపెనీ అంగీకరించినప్పటికీ, ఇప్పటివరకు కంపెనీ వైపు నుండి ఎటువంటి పరిష్కారం చూపలేదు.
ఇంతకుముందు కూడా ఫిర్యాదు
ఇంతకు ముందు కూడా నథింగ్ ఫోన్‌పై ఓ యూజర్ ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. అతని ట్వీట్ లో - వాటర్ రెసిస్టెంట్ IP53 రేటింగ్ ఉన్న తర్వాత కూడా ఫోన్ కెమెరాలో తేమ వచ్చింది. ఈ ట్వీట్‌లో సహాయం కోరుతూ యూజర్ కంపెనీ సీఈఓ కార్ల్ పీని కూడా ట్యాగ్ చేశారు. అయితే, అతని ఫిర్యాదు తర్వాత, కొత్త ఫోన్‌ను పంపుతామని అతనికి హామీ ఇచ్చింది.
వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ కొత్త టెక్ కంపెనీ నథింగ్ ఫోన్ మొదటి స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1ని జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ మార్కెట్లోకి రాకముందే దాని ఫీచర్లు, డిజైన్ గురించి చాలా చర్చలో నిలిచింది.