ఈ నెలాఖరులో చైనాలో ‘నోకియా 6’ ఆవిష్కరణ?

First Published 11, Jan 2019, 8:04 AM IST
Nokia 6 (2019) With Dual Cameras, Snapdragon 632 SoC Said to Launch This Month
Highlights

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు అంతర్జాతీయ మొబైల్ మార్కెట్ ను కైవసం చేసుకునే దిశగా అడుగులేస్తుంటే.. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ చైనా మార్కెట్ వైపు కేంద్రీకరించింది. ఈ నెలాఖరులోగా నోకియా 6 మోడల్ ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. 

నోకియా వినియోగదారులకు హెచ్‌ఎండీ గ్లోబల్ ఈ నెలాఖరులో గానీ,  వచ్చేనెల మొదటి వారంలో 6.2 అంగుళాల నిడివి గల ‘నోకియా 6’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. చైనా మార్కెట్‌లో తొలిసారి నోకియా 6తోపాటు నోకియా 9 మోడల్ స్మార్ట్ ఫోన్ కూడా ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. 

16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 632ఎస్‌వోసీ అమర్చారు. ఈ ఫోన్ 4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్లలో లభించనున్నది. దీనికి అదనంగా ఓజో ఆడియో కూడా చేర్చారు. నోకియా తన ఫ్లాగ్ షిప్ ‘నోకియా 9’ మోడల్ స్మార్ట్ ఫోన్‌ను కొద్ది సమయం తీసుకుని మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. నోకియా 9 ప్లగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మాదిరిగా నోకియా 6 ఫోన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.  ఈ ఫోన్ మెరుగైన ప్రాసెసర్‌తోపాటు బిగ్ డిస్ ప్లే కలిగి ఉండనున్నది. 

భారత్ మార్కెట్లోకి ‘హువావే వై 9’ఆవిష్కరణ
చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు హువావే మరో స్మార్ట్‌ఫోన్‌ను  భారత  మార్కెట్లో లాంచ్‌ చేసింది. వై సిరీస్‌లో  భాగంగా తొలి స్మార్ట్‌ఫోన్‌ను వై 9 పేరుతో గురువారం విడుదల చేసింది. ముందూ, వెనక  మొత్తం నాలుగు బిగ్‌ కెమెరాలతో.. యూజర్లు ఫోటోగ్రఫీలో మాస్టర్‌ అయిపోతారని కంపెనీ వ్యాఖ్యానించింది. కాగా ఆ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పటికే చైనాలో గత ఏడాది తీసుకొచ్చింది. ఈ నెల 15నుంచి ఈ- కామర్స్ స్టోర్ అమెజాన్‌లో ప్రత్యేకంగా విక్రయానికి అందుబాటులో ఉండనుంది. 

హువావే ‘వై 9’ ఫీచర్లు ఇవే:
6.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే గల హువావే వై9 ఫోన్‌లో 2340x1080 రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో 2.2 ఆక్టాకోర్‌  కిరిన్‌ 710 సాక్‌, 4జీబీ ప్లస్ 64జీబీ నుంచి 256దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం ఉన్నాయి. ఇక 16+2ఎంపీ  డ్యుయల్‌ రియర్‌కెమెరా, 13+2 ఎంపీ డ్యుయల్‌  సెల్ఫీ కెమెరాలతోపాటు 4000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ కూడా అమర్చారు. ఈ ఫోన్ రూ.15,999లకు లభించనున్నది.

loader