Asianet News TeluguAsianet News Telugu

స్ట్రాంగ్ సౌండ్, బేస్ తో రూ.599కే కొత్త నెక్‌బ్యాండ్.. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 7 గంటల బ్యాకప్..

పిట్రాన్  ఈ నెక్‌బ్యాండ్ ని బ్లాక్, బ్లూ, గ్రీన్ ఇంకా బ్లూ-రెడ్  కలర్ ఆప్షన్స్ లో  తీసుకొచ్చారు. ఈ నెక్‌బ్యాండ్ ధర రూ. 799, కానీ లాంచింగ్ ఆఫర్‌ కింద దీనిని ప్రస్తుతం రూ. 599కి కొనుగోలు చేయవచ్చు.

Neckband with strong sound and noise cancellation for Rs 599, battery backup is also 60 hours
Author
First Published Dec 3, 2022, 7:37 PM IST

దేశీయ కంపెనీ  పిట్రాన్ (pTron) ఇండియాలో కొత్త ఆడియో ప్రాడక్ట్ పిట్రాన్ టాంజెంట్ స్పోర్ట్స్ నెక్‌బ్యాండ్‌ను లాంచ్ చేసింది. పిట్రాన్  టాంజెంట్ స్పోర్ట్స్‌లో బ్లూటూత్ 5.2 అండ్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC)కి సపోర్ట్ ఇచ్చారు. నెక్‌బ్యాండ్‌తో 40ms లో-లేటెన్సీ మోడ్‌కు కూడా సపోర్ట్ ఉంది. ఈ నెక్‌బ్యాండ్‌  60 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది.

పిట్రాన్ టాంజెంట్ స్పోర్ట్స్ ధర 
పిట్రాన్  ఈ నెక్‌బ్యాండ్ ని బ్లాక్, బ్లూ, గ్రీన్ ఇంకా బ్లూ-రెడ్  కలర్ ఆప్షన్స్ లో  తీసుకొచ్చారు. ఈ నెక్‌బ్యాండ్ ధర రూ. 799, కానీ లాంచింగ్ ఆఫర్‌ కింద దీనిని ప్రస్తుతం రూ. 599కి కొనుగోలు చేయవచ్చు. పిట్రాన్ టాంజెంట్ స్పోర్ట్స్ ని  కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్ ఇంకా ఫ్లిప్ కార్ట్ ఇండియాలో  కొనుగోలు చేయవచ్చు.

పిట్రాన్ టాంజెంట్ స్పోర్ట్స్ ఫీచర్స్ 
పిట్రాన్ టాంజెంట్ స్పోర్ట్స్ నెక్‌బ్యాండ్ 10ఎం‌ఎం డైనమిక్ ఆడియో డ్రైవర్‌, పంచ్ బేస్ అందిస్తుంది. నెక్‌బ్యాండ్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) అండ్ 40ms లో-లేటెన్సీ మోడ్‌కు సపోర్ట్ చేస్తుంది. నెక్‌బ్యాండ్‌లో హెచ్‌డి మైక్ సపోర్ట్ ఇచ్చారు. మాగ్నెటిక్ ఇయర్‌బడ్స్, వాయిస్ అసిస్టెంట్, వాయిస్ కాలింగ్, ప్లే అండ్ మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు నెక్‌బ్యాండ్‌లో ఉన్నాయి. నెక్‌బ్యాండ్‌ని ఆండ్రాయిడ్ ఇంకా iOS రెండింటికి కనెక్ట్ చేయవచ్చు. నెక్‌బ్యాండ్‌తో గూగుల్ ఇంకా సిరి వాయిస్ అసిస్టెంట్‌లకు కూడా సపోర్ట్ ఉంది.

pTron టాంజెంట్ స్పోర్ట్స్ బ్యాటరీ లైఫ్ 
pTron టాంజెంట్ స్పోర్ట్స్‌లో 300mAh బ్యాటరీ, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బ్యాటరీకి సంబంధించి నెక్‌బ్యాండ్‌తో 60 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇంకా 10 నిమిషాల ఛార్జింగ్‌లో 7 గంటల వరకు బ్యాకప్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. pTron టాంజెంట్ స్పోర్ట్స్ వాటర్ రిసిస్టంట్ కోసం IPX4 రేటింగ్‌ పొందింది. దీని బరువు 30 గ్రాములు. 

Follow Us:
Download App:
  • android
  • ios