మోటో జి22  హెచ్‌డి ప్లస్ మాక్స్ విజన్ డిస్‌ప్లేతో వస్తుంది. గ్రాఫిక్స్ కోసం, మోటో జి22 PowerVR GE8320 GPUతో 4జి‌బి ర్యామ్, 64జి‌బి  స్టోరేజ్ ప్యాక్ చేస్తుంది. మోటో జి22 50-మెగాపిక్సెల్ కెమెరాతో పరిచయం చేసారు. 

దేశీయ సంస్థ మోటోరోలా(Motorola) కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో జి22ను యూరప్‌లో విడుదల చేసింది. మోటో జి22లో MediaTek Helio ప్రాసెసర్ అందించారు. అంతేకాకుండా హెచ్‌డి ప్లస్ మాక్స్ విజన్ డిస్‌ప్లేతో వస్తుంది. గ్రాఫిక్స్ కోసం, మోటో జి22 PowerVR GE8320 GPUతో 4జి‌బి ర్యామ్, 64జి‌బి స్టోరేజ్ ప్యాక్ చేస్తుంది. మోటో జి22 50-మెగాపిక్సెల్ కెమెరాతో పరిచయం చేసారు. 

మోటో జి22 ధర, లభ్యత
మోటో జి22 ధర 169.99 యూరోలు అంటే దాదాపు రూ. 14,270. మోటో జి22 4జి‌బి ర్యామ్, 64జి‌బి స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్‌లో మాత్రమే పరిచయం చేసారు. ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లోకి రానుంది. మోటో జి22 కాస్మిక్ బ్లాక్, ఐస్‌బర్గ్ బ్లూ, పెరల్ వైట్ రంగులలో అందుబాటులో ఉంటుంది.

మోటో జి22 స్పెసిఫికేషన్లు 
 ఇందులో Android 12 ఆధారిత MyUX ఇచ్చారు. మ్తో జి22 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే, డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 90Hz, ఫోన్‌లో MediaTek Helio G37 ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం PowerVR GE8320 GPU, 4జి‌బి ర్యామ్ తో 64జి‌బి స్టోరేజ్ ఇచ్చారు.

మోటో G22కెమెరా
 కెమెరా గురించి మాట్లాడితే మోటో ఈ ఫోన్ లో నాలుగు బ్యాంక్ కెమెరాల ఇచ్చారు, దీని ప్రైమరీ లెన్స్ f/1.8 ఎపర్చరుతో 50 మెగాపిక్సెల్స్. రెండవ లెన్స్ f/2.2 ఎపర్చరుతో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్. మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, నాల్గవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో, ముందు భాగంలో సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

మోటో G22 బ్యాటరీ
కనెక్టివిటీ కోసం, మోటో జి22 4G LTE, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5, NFC, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఫేస్ అన్‌లాక్‌ను పొందుతుంది. మోటో G22 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, అయితే బాక్స్‌లో 10W ఛార్జర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫోన్ బరువు 185 గ్రాములు.