మోటో నుంచి మరో క్రేజీ 5g స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్.. లాంచ్‌కి ముందే లీక్
మోటో ఫ్యామిలీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది. 5G టెక్నాలజీతో Moto G85 జూలై 10న విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ జూన్ 26న యూరోపియన్ మార్కెట్‌లో విడుదలైంది.
న్యూఢిల్లీ: అమెరికన్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా MOTO G85 5Gని జూలై 10న భారత్‌లో లాంచ్ చేయనుంది. అయితే సేల్స్ ముందు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ వెల్లడయ్యాయి.
మోటో ఫ్యామిలీకి చెందిన ఈ స్మార్ట్ ఫోన్ జూలై 10న విడుదల కానుంది. కాగా, జూన్ 26న యూరోపియన్ మార్కెట్‌లో విడుదలైంది ఈ మోడల్. Moto G85 అనేది Motorola S50 Neoకి అప్‌గ్రేడ్ వెర్షన్. Moto G85 Flipkart ద్వారా అమ్మకానికి ఉంటుంది. డిస్‌ప్లే, చిప్‌సెట్, బ్యాటరీతో సహా ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో చూడవచ్చు.
Moto G85 5G.. 6.67-అంగుళాల OLED స్క్రీన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది. 175 గ్రాముల బరువుతో మూడు కలర్ వేరియంట్‌లలో 7.59mm మందం, స్నాప్‌డ్రాగన్ 6S3 చిప్‌సెట్‌తో 12GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్ లభిస్తుంది. ఈ మోడల్‌లో 8GB RAM+128GB స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది. Moto G85 5G ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వస్తుంది.
ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో 50 MP ప్రధాన కెమెరా, కెమెరాలో Sony LVT-600 సెన్సర్ ఉంది. వీడియోలను షూట్ చేయడానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సహాయపడుతుంది. డ్యూయల్ కెమెరా సెటప్‌లోని మరో హైలైట్ అల్ట్రా-వైడ్ కెమెరా. సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్స్. Moto G85 స్మార్ట్ కనెక్ట్, ఫ్యామిలీ స్పేస్, మోటో సెక్యూర్ వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్‌లతో కూడా వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ, 90 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 38 గంటల టాక్ టైమ్, 22 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ క్లెయిమ్ చేస్తుంది.