android app malware:ఆండ్రాయిడ్ యూజర్ల లక్ష్యంగా న్యూ బ్యాంకింగ్ మాల్వేర్.. ఈ యాప్‌ను వెంటనే డిలెట్ చేయండి..

క్సేనో మార్ఫ్ అనే మాల్వేర్ ని ఫాస్ట్ క్లీనర్ అనే యాప్‌లో కనుగొన్నారు, దీనిని 50 వేల మందికి పైగా వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులో మాల్వేర్ ఉందో లేదో కూడా యూజర్లకు తెలియని విధంగా ఈ యాప్ రూపొందించారని ఒక నివేదికలో తెలిపింది.
 

More than 50,000 Android users need to delete this malicious app now immediately

సాధారణంగా స్మార్ట్ ఫోన్ లోని జంక్ ఫైల్స్(junk files) డిలెట్ చేయడానికి ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది ఇందుకు వివిధ యాప్స్ ఉపయోగిస్తుంటారు. వీటిలో కొన్ని యాప్స్ మీ వ్యక్తిగత డేటా లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని హ్యాక్ చేయవచ్చు. తాజాగా 
మరో కొత్త ఆండ్రాయిడ్ మాల్వేర్ గుర్తించబడింది. థ్రెట్ ఫ్యాబ్రిక్ నివేదిక ప్రకారం జెనోమార్ఫ్ అనేది ఆండ్రాయిడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే బ్యాంకింగ్ ట్రోజన్. దీనిని గూగుల్ ప్లే స్టోర్ లోని యాప్స్ లో చూడవచ్చు. అతిపెద్ద విషయం ఏమిటంటే ఈ నివేదిక తెరపైకి వచ్చిన తర్వాత కూడా ఈ అనుమానాస్పద యాప్ ప్లే స్టోర్  నుండి తొలగించలేదు. 

నివేదిక ప్రకారం జెనోమార్ఫ్ మాల్వేర్ యూరప్‌లోని ఆండ్రాయిడ్ వినియోగదారులను టార్గెట్ చేసుకుంటోంది. Xenomorph మాల్వేర్ ఫాస్ట్ క్లీనర్ అనే యాప్‌లో ఉంది, దీనిని 50 వేల మందికి పైగా వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులో మాల్వేర్ ఉందో లేదో కూడా యూజర్లకు తెలియని విధంగా ఈ యాప్ రూపొందించారు.

బ్యాంకింగ్ Trojan Xenomorph మీ ఫోన్‌లోని బ్యాంక్ యాప్ నుండి మీ బ్యాంక్ వివరాలను లేదా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించగలదు. అంటే మీ బ్యాంక్ నుండి వచ్చే ప్రతి మెసేజ్ ట్రాక్ చేస్తుంది. ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ యాప్ వినియోగదారుల ప్రతి కార్యాచరణను పర్యవేక్షిస్తుంది.

ఈ మొత్తం సమాచారాన్ని తీసుకున్న తర్వాత ఈ యాప్ మీ బ్యాంక్ వెబ్ లేదా యాప్‌ను పోలి ఉండే బ్యాంకింగ్ లావాదేవీ వంటి ఇంటర్‌ఫేస్‌ను సృష్టిస్తుంది, దీని ద్వారా వినియోగదారులను మోసం చేస్తుంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా మీ ఫోన్ నుండి ఈ ఫాస్ట్ క్లీనర్ యాప్‌ని తొలగించడం మంచిది.

గూగుల్ ప్లే స్టోర్ లో హల్‌చల్ చేస్తున్న యాప్ టూ-ఫాక్టర్ అథెంటికేషన్ ( 2FA ). ఈ యాప్ మీ బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలించగలదని ఫ్రాన్స్‌కు చెందిన మొబైల్ సెక్యూరిటీ రీసెర్చ్ అండ్ ప్రొడక్ట్ ప్రొవైడర్  ప్రాడో (Pradeo) పరిశోధకులు తెలిపారు. ఈ బృందం ప్రకారం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించినప్పటికి 10,000పైగా   ఇన్‌స్టాలేషన్‌లను చూపిస్తూ 15 రోజుల పాటు ఆక్టివ్ గా ఇంకా అందుబాటులో ఉంది.

నివేదిక ప్రకారం ఈ యాప్‌లో "ట్రోజన్-డ్రాపర్" ఉంది, అంటే బ్యాంక్ సమాచారాన్ని దొంగిలించే మాల్వేర్‌ను వినియోగదారుల మొబైల్ డివైజెస్ లో ఇన్‌స్టాల్ చేస్తుంది. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన ఎవరైనా వెంటనే డిలెట్ చేయాలని సూచించారు. అయితే ఈ యాప్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి, తద్వారా మీరు యాప్‌ను స్వయంగా తీసివేయవచ్చు.

అప్లికేషన్ ID
https://play.google.com/store/apps/details?id=com.privacy.account.safetyapp (యాప్ అప్పటి నుండి తీసివేయబడింది)
2FA Authenticator
com.privacy.account.safetyapp
వెర్షన్ 1.0

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios