Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్లోకి హెల్త్ ఫీచర్స్ తో కొత్త స్మార్ట్‌వాచ్.. 70% వరకు డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరకా...

మివీ మోడల్ E బ్లూ, బ్లాక్, గ్రీన్, గ్రే, రెడ్ అండ్ క్రీమ్ కలర్ ఆప్షన్‌లో పరిచయం చేసారు. ఈ వాచ్ ని డిసెంబర్ 1 నుండి కంపెనీ వెబ్‌సైట్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా  కొనుగోలు చేయవచ్చు.

Mivi first smartwatch launched in India, up to 70% discount   know features
Author
First Published Dec 2, 2022, 12:02 PM IST

దేశీయ కంపెనీ మివీ బ్రాండ్ మివీ మోడల్ ఇ స్మార్ట్‌వాచ్‌ లాంచ్ తో స్మార్ట్‌వాచ్ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పుడు కంపెనీ మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ తక్కువ ధరతో వస్తుంది ఇంకా ఎన్నో హెల్త్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. Mivi మోడల్ Eకి స్క్వేర్ డయల్, మెటాలిక్ ఫినిషింగ్‌  అందించారు. దీనికి 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 1.69-అంగుళాల TFT HD డిస్‌ప్లే ఉంది అలాగే 50 కంటే ఎక్కువ క్లౌడ్ వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది. మివీ యాప్ ద్వారా వాచ్‌ని యాక్సెస్ చేయవచ్చు.

మివీ మోడల్ E ధర
మివీ మోడల్ E బ్లూ, బ్లాక్, గ్రీన్, గ్రే, రెడ్ అండ్ క్రీమ్ కలర్ ఆప్షన్‌లో పరిచయం చేసారు. ఈ వాచ్ ని డిసెంబర్ 1 నుండి కంపెనీ వెబ్‌సైట్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా  కొనుగోలు చేయవచ్చు. Mivi మోడల్ E ధర రూ. 3,999, కానీ లాంచ్ ఆఫర్‌ కింద  దీనిని ప్రస్తుతం రూ. 1,299 ధరకే కొనుగోలు చేయవచ్చు. 

Mivi మోడల్ E ఫీచర్స్ 
1.69-అంగుళాల TFT HD డిస్ ప్లే Mivi మొదటి వాచ్‌తో సపోర్ట్ చేస్తుంది. వాచ్ 50కి పైగా క్లౌడ్ వాచ్ ఫేస్‌లు, 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇచ్చారు. హార్ట్ రేట్ ట్రాకింగ్, SpO2 మానిటర్, స్లీప్ ట్రాకర్, పీరియడ్ ట్రాకర్ వంటి హెల్త్ ఫీచర్లకు వాచ్ సపోర్ట్ చేస్తుంది. వాచ్ తో  స్టెప్ కౌంటింగ్ కూడా చేయవచ్చు. 

Mivi యాప్ ద్వారా అన్ని ఆక్టివిటీస్ ట్రాక్ చేయవచ్చు. మోడల్ E వాచ్ బ్లూటూత్ వెర్షన్ 5.1కి సపోర్ట్ చేస్తుంది ఇంకా కెమెరా/మ్యూజిక్ కంట్రోల్స్, స్మార్ట్ నోటిఫికేషన్స్, వాతావరణ అప్‌డేట్స్, కాల్ రిజెక్ట్ లేదా మ్యూట్ వంటి ఎన్నో ఫీచర్లతో వస్తుంది.

Mivi మోడల్ E బ్యాటరీ 
బ్యాటరీకి సంబంధించి  ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇంకా 20 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ ఉంటుంది. మోడల్ E వాటర్ రిసిస్టంట్ కోసం IP68 రేటింగ్ పొందింది.

Follow Us:
Download App:
  • android
  • ios