మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన; చెత్తకుప్పలో 24 కోట్ల కంప్యూటర్లు...

అక్టోబర్ 2025 నాటికి Windows 10కి సపోర్ట్ ముగించాలని Microsoft లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 2028 వరకు Windows 10 డివైజెస్ కి సేఫ్టీ అప్ డేట్స్  అందిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దీనికి అన్యువల్ ఫీజు వసూలు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. 

Microsofts new move; after  24 crore personal computer with Windows will Affect-sak

అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కార్పొరేషన్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ ముగించబోతోంది. దీంతో 24 కోట్ల పర్సనల్ కంప్యూటర్‌లకు టెక్నాలజీ సపోర్ట్  నిలిచిపోయింది. దీనివల్ల ఇ-వ్యర్థాలు భారీగా కుప్పలు తెప్పలుగా పేరుకుపోతాయని అనలిటికల్ సంస్థ కెనాలిస్ రీసెర్చ్ అంచనా వేసింది. మైక్రోసాఫ్ట్ నిర్ణయం అమలైతే దాదాపు 48 కోట్ల కిలోల ఈ-వేస్ట్ ఉత్పత్తి అవుతుంది. అంటే 3,20,000 కార్లకు సమానమని అంచనా.

అక్టోబర్ 2025 నాటికి Windows 10కి సపోర్ట్ ముగించాలని Microsoft లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 2028 వరకు Windows 10 డివైజెస్ కి సేఫ్టీ అప్ డేట్స్  అందిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దీనికి అన్యువల్ ఫీజు వసూలు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. రాబోయే OS PC లకు అధునాతన కృత్రిమ మేధస్సు టెక్నాలజీలను  తీసుకువస్తుంది. దీని వల్ల మందగమనంలో ఉన్న పీసీ మార్కెట్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. కెనాలిస్ రీసెర్చ్ OS సపోర్ట్  ముగిసినప్పటికీ, అనేక  పర్సనల్ కంప్యూటర్స్  (PC)లు ఇప్పటికీ సంవత్సరాలపాటు ఉపయోగంలో ఉంటాయి, కానీ సేఫ్టీ  అప్ డేట్స్ లేకపోవడం వల్ల డిమాండ్ తగ్గుతుంది.

చాలా పాత కంప్యూటర్లు మైక్రోసాఫ్ట్  అప్ డేటెడ్ OS, Windows 11ను అమలు చేయగలవని తెలిపింది. కానీ వాస్తవం అది కాదు. దాదాపు 70 శాతం వ్యాపారాలు Windows 10ని ఉపయోగిస్తున్నాయి. ఈ నివేదిక కంప్యూటర్ వరల్డ్ నుండి వచ్చింది. విండోస్ 7తో మైక్రోసాఫ్ట్ ఇచ్చిన కన్సెషన్  విండోస్ 10కి కూడా ఇవ్వవచ్చని వాదించారు. Windows 11 ఐకాన్స్ ఉంది. Windows 10 కంట్రోల్ ప్యానెల్ ఎటువంటి పెద్ద మార్పులు లేకుండా Windows 11లో అలాగే ఉంచబడింది. Windows 10 అనుభవాన్ని కోరుకునే వారి కోసం Windows 11 కొన్ని థర్డ్-పార్టీ టూల్స్  కూడా విడుదల చేసింది. 

Windows 10ని వదిలివేయడానికి గేమర్‌లు ఇష్టపడరు. 11   అధిక భద్రత కూడా గేమర్‌లకు తలనొప్పి. Windows 10 వరకు ఉన్న వెర్షన్స్ చాలా హార్డ్‌వేర్‌లో రన్ అవుతాయి. మీరు మైక్రోసాఫ్ట్ పేర్కొన్న కెపాసిటీ  కలిగి ఉంటే మాత్రమే ఇది పని చేస్తుంది. ఐటి నిపుణులు ఈ వ్యవస్థను ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడతారు. Windows 11 దీన్ని పూర్తిగా అనుమతించదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios