న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ.. ‘ఎంఐ సూపర్ సేల్’పేరుతో పలు ఆఫర్లతో అధికారిక వెబ్ సైట్ ఎంఐ.కాంలో సేల్ ప్రారంభించింది. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా ఎంఐ, రెడ్ మీ, పోకో మొబైల్ ఫోన్లపై రాయితీలు ప్రకటించింది. ఎంఐ ఏ2, రెడ్ మీ వై3, పోకో ఎఫ్1పై ఎంఐ ఎక్స్ఛేంజ్‌లో అదనంగా రూ.2,000 వరకు రాయితీని ఇవ్వనున్నది.

4 జీబీ ర్యామ్ విత్ 64జీబీ అంతర్గత మెమొరీ గల రెడ్ మీ నోట్-7 ప్రో వేరియంట్ ఫోన్ రూ.13,999కే లభించనుంది. ఈ ఫోన్‌లో  క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, (48+5) మెగాపిక్సెల్ డ్యుయెల్ రేర్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. 

ఇక 3 జీబీ/32 జీబీ వెర్షన్ గల రెడ్ మీ నోట్7 ఎస్ ఫోన్ రూ.9,999కి  వినియోగదారులకు రానుంది. 4 జీబీ/ 64 జీబీ వేరియంట్ రూ. 11,999కి లభిస్తుంది. 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ టచ్ స్క్రీన్,, 2340×1080 రిజల్యోషన్, 4000ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగెన్ 660 ప్రాసెసర్, (48+5) మెగాపిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా తదితర ఫీచర్లు కలిగి ఉంది.

3జీబీ ర్యామ్‌తోపాటు 32జీబీ అంతర్గత మెమొరీ గల వేరియంట్ రెడ్ మీ వై3 ఫోన్ రూ.8,999కే వినియోగదారులకు లభ్యం కానున్నది. 4 జీబీ/ 64 జీబీ వేరియంట్ ఫోన్ రూ. 11,999కి లభిస్తుంది. ప్రైమ్ బ్లాక్, ఎలెగెంట్ బ్లూ , బోల్డ్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్, 4000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.26 అంగుళాల హెచ్డీ ప్లస్ స్ర్కీన్ తదితర ఫీచర్లు ఈ ఫోన్లో లభిస్తాయి.

2 జీబీ/ 32 జీబీ వేరియంట్  రెడ్ మీ 7 ఫోన్ రూ.7,499కే లభ్యం కానుంది. 3 జీబీ / 32 జీబీ వేరియంట్ పోన్ రూ. 8,499కి కొనుగోలు చేయొచ్చు. క్లిప్స్ బ్లాక్, కామెట్ బ్లూ, లూనార్ రెడ్ వంటి రంగుల్లో లభిస్తుంది.(12+2) మెగాపిక్సెల్ గల ఏఐ డ్యుయెల్ రేర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.26 అంగుళాల హెచ్డీ ప్లస్ స్క్రీన్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

6 జీబీ/64 జీబీ వేరియంట్ పోకో ఎఫ్1 ఫోన్ రూ.17,999, 6 జీబీ/128 జీబీ వేరియంట్ ధర రూ.18,999. 8 జీబీ/256 జీబీ వేరియంట్ ధర రూ.22,999 లభించనున్నది. దీనికి ఎంఐ ఎక్స్చేంజ్ ద్వారా అదనంగా ఇంకా రూ.2000 రాయితీ పొందే అవకాశం కూడా ఉంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 మెగాపిక్సెల్ గల ఫ్రంట్ కెమెరా, (12+5) మెగాపిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా తదితర ఫీచర్లు చేర్చారు.

4 జీబీ/64 జీబీ వేరియంట్ ఎంఐ ఏ2 ఫోన్ రూ.9,999కి లభిస్తోంది. దీనికి ఎక్స్చేంజ్ ద్వారా అదనంగా రూ.1000 వరకు రాయితీ పొందవచ్చు. ఆండ్రాయిడ్ వన్ ఓపరేటింగ్ సిస్టమ్, (12+20)మెగాపిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి.