ఆ ఒక్క గంటన్నర; వేల కోట్ల నష్టం.. అసలు ఎం జరిగింది..?

ప్రపంచవ్యాప్తంగా మెటా  సేవలు నిలిచిపోవడంతో మెటా షేర్లు 1.6 శాతం పడిపోయాయి. వాల్ స్ట్రీట్‌లో ఓవర్‌నైట్ ట్రేడింగ్‌లో మెటా స్టాక్ $490.22 వద్ద ముగిసింది.
 

meta servers down: That hour and a half; Zuckerberg's loss is 23,127 crores-sak

మెటాకు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్‌లు, మెసెంజర్ సేవలు  స్తంభించడంతో.. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌కు 3 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, జుకర్‌బర్గ్ నికర విలువ ఒక్క రోజులో 2.79 బిలియన్ డాలర్లు (రూ. 23,127 కోట్లు) తగ్గి 17.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మెటా సేవలు నిలిచిపోవడంతో మెటా షేర్లు 1.6 శాతం పడిపోయాయి. వాల్ స్ట్రీట్‌లో ఓవర్‌నైట్ ట్రేడింగ్‌లో మెటా స్టాక్ $490.22 వద్ద ముగిసింది. అయినప్పటికీ, జుకర్‌బర్గ్ ఇప్పటికీ ప్రపంచంలోని టాప్ 4 ధనవంతుడి  స్థానంలో కలిగి ఉన్నారు. 

తాజాగా గంటన్నర పాటు మెటా ప్లాట్‌ఫారమ్‌ సేవలు  డౌన్ అయ్యాయి. ఫేస్‌బుక్ అండ్  ఇన్‌స్టాగ్రామ్‌లు  ఇంత ఎక్కువసేపు ఆగిపోవడం  చాలా అరుదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి కానీ ఇంత సేపు   కాదు. ఈసారి ఫేస్‌బుక్ ఆటోమాటిక్ గా లాగ్ అవుట్ అయ్యాయి. తర్వాత సమస్యను పరిష్కరించాక  లాగిన్ జరిగింది. 

మెటా యూజర్లకు  కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది ఇంకా సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఎందుకు బ్లాక్ చేశారనే దానిపై స్పష్టత రాలేదు. సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణమా అనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. షట్‌డౌన్ తర్వాత, #facebook ఆండ్  #facebookdown అనే హ్యాష్‌ట్యాగ్‌లు Xలో ట్రెండింగ్‌లో నిలిచాయి. దీని గురించి Xలో వందలాది పోస్ట్‌లు పోస్ట్ చేయబడ్డాయి. దీని తర్వాత చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. 

 అంతేకాదు ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ కూడా మెటాను ఎగతాళి చేస్తూ సిన్ లోకి  దిగాడు. 'మీరు ఈ పోస్ట్ చదువుతున్నారంటే, మా సర్వర్లు పని చేస్తున్నయని.'  అంటూ ఎలోన్ మస్క్ కామెంట్ చేసారు. 

meta servers down: That hour and a half; Zuckerberg's loss is 23,127 crores-sak

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios