లీకేజీలు జరిగినా.. సంపదలో దూసుకెళ్తున్న జుకర్‌బర్గ్..ప్రపంచంలో నెంబర్‌ 3

mark zuckerberg is third Richest person in the world
Highlights

ప్రపంచ కుబేరుల జాబితాలో జుకర్‌బర్గ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన మొత్తం సంపద 81.6 బిలియన్ డాలర్లుగా ఉంది.. ఈ జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ మొదటిస్థానంలోనూ.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ రెండవ స్థానంలో ఉన్నారు.

వినియోగదారుల డేటాను కేంబ్రిడ్జి అనలిటికా అనే సంస్థకు అందజేసి.. నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫేస్‌బుక్ వ్యవస్థపాకుడు మార్క్ జుకర్‌బర్గ‌పై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అనేక దేశాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా సెనేట్‌ల ముందు హాజరై క్షమాపణలు చెప్పినప్పటికి.. ప్రపంచం ఆయన్ను క్షమించలేదు..

దీని ప్రభావం ఫేస్‌బుక్‌పై బాగానే పడింది.. దీనికి ముందు ఆకాశంలో ఉన్న ఫేస్‌బుక్ షేర్లే విలువ.. ఏకంగా 152.22 డాలర్ల కనిష్టానికి పడిపోయింది. ఇది చూసినవారెవరైనా జుకర్‌బర్గ్ పరిస్థితి అయిపోయినట్లేనని భావించారు. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. ప్రపంచ కుబేరుల జాబితాలో జుకర్‌బర్గ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన మొత్తం సంపద 81.6 బిలియన్ డాలర్లుగా ఉంది..

ఈ జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ మొదటిస్థానంలోనూ.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ రెండవ స్థానంలో ఉన్నారు. ఇంతకు ముందు అమెరికన్ వ్యాపారవేత్త వారన్ బఫెట్ మూడో స్థానంలో ఉండేవారు.. అయితే ఆయన తన సంపదను పెద్ద మొత్తంలో ఛారిటీలకు అందిస్తూ ఉండటంతో బఫెట్ సంపద విలువ తగ్గిపోతూ వస్తోంది. 

loader