Asianet News TeluguAsianet News Telugu

ఖతర్నాక్ కెమెరా.. 2 రోజుల బ్యాటరీ లైఫ్ తో లావా కొత్త 5G ఫోన్.. ! ఈసారి అనుకున్న ధరకే లాంచ్..

లావా విడుదల చేసిన టీజర్ వీడియో ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ పంచ్-హోల్ డిస్‌ప్లేతో ఉంటుందని తెలుస్తోంది. దీనికి  50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో కూడిన డ్యూయల్ AI కెమెరా  ఉందని చెబుతున్నారు.
 

Lava Yuva 5G: Accurate Camera... Long Lasting Battery... Lava Yuva 5G Mobile Released Soon!-sak
Author
First Published May 28, 2024, 4:49 PM IST

ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ ఈ వారం ఇండియాలో లాంచ్ కానుంది. లావా కంపెనీ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌లో ఈ కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను మే 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మొబైల్‌కి సంబంధించిన టీజర్‌ వీడియో కూడా విడుదలైంది.

Lava Yuva 5G సేల్స్ అమెజాన్‌లో ఇప్పటికే   మొదలయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం అమెజాన్ సైట్‌లో ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా రూపొందించారు. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో వస్తుంది, లావా స్మార్ట్‌ఫోన్ మే 30 మధ్యాహ్నం 12:00 గంటలకు లాంచ్ చేయబడుతుంది.

లావా విడుదల చేసిన టీజర్ వీడియో ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ పంచ్-హోల్ డిస్‌ప్లేతో ఉంటుందని తెలుస్తోంది.  50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో కూడిన డ్యూయల్ AI కెమెరా ఉంటుందని చెబుతున్నారు.

బ్యాక్ ప్యానెల్ కింద  నిలువుగా లావా బ్రాండింగ్ ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ కూడా మాట్టే ఫినిషింగ్ తో కనిపిస్తుంది. కొత్తగా వస్తున్న 5G-ఫోన్  Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ రెండు రోజుల బ్యాటరీ లైఫ్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు.

LXX513 మోడల్ నంబర్‌తో ఉన్న Lava Yuva 5G మొబైల్ గురించి ఇటీవల సమాచారం లీక్ ఇంకా వైరల్ అయ్యింది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో రన్ అవుతుందని, 6జీబీ అలాగే  8జీబీ ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది.

భారతదేశంలో అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా మొబైల్‌ను రూ. 10,000 లోపు ధరతో విక్రయించాలని భావిస్తుంది. బడ్జెట్‌లో 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకునే వారికి ఈ మొబైల్ సరైన అప్షన్ అని గాడ్జెట్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios