జియో శాటిలైట్ ఇంటర్నెట్.. త్వరలో మారుమూల ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ..
రిలయన్స్ జియో గత నెలలో దీపావళి నాటికి ఇండియాలోని ప్రముఖ నగరాల్లో 5జి కనెక్టివిటీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 2023 చివరి నాటికి భారతదేశం మొత్తం 5G కనెక్టివిటీతో అనుసంధానించబడుతుందని కంపెనీ తెలిపింది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రిలయన్స్ జియో శాటిలైట్ యూనిట్‌ను ఆమోదించింది. డిఓటి (DoT)కంపెనీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI)ని కూడా జారీ చేసింది. ఇప్పుడు జియో త్వరలో ఇండియాలో గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ శాటిలైట్ (GMPCS) సేవలను లాంచ్ చేయనుంది. జియో ఇంటర్నెట్ సేవలతో పాటు వాయిస్ సేవలను కూడా లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. ఇంతకుముందు, శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ హ్యూస్ కమ్యూనికేషన్స్ ఇస్రో సహాయంతో భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్లు తెలిపింది.
రిలయన్స్ జియో గత నెలలో దీపావళి నాటికి ఇండియాలోని ప్రముఖ నగరాల్లో 5జి కనెక్టివిటీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 2023 చివరి నాటికి భారతదేశం మొత్తం 5G కనెక్టివిటీతో అనుసంధానించబడుతుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు జియోకి డిఓటి అనుమతితో జియో శాటిలైట్ ఇంటర్నెట్‌లో వేగంగా పని చేస్తుంది. రిలయన్స్ జియో శాటిలైట్ యూనిట్ లైసెన్స్ ఉన్న ప్రాంతాల్లో శాటిలైట్ సేవలను విడుదల చేయగలదు. వీటిలో డేటాతో పాటు వాయిస్ సేవలు కూడా ఉంటాయి.
జియో శాటిలైట్ యూనిట్‌ని జియో శాటిలైట్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (JSCL) అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాటిలైట్ ఆధారిత కనెక్టివిటీ కంపెనీ ఎస్‌ఈఎస్ తో జియో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
జియో కంటే ముందు, శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ హ్యూస్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహాయంతో భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్లు ప్రకటించింది. హ్యూస్ కమ్యూనికేషన్స్ ఇండియా ఇస్రో GSAT-11, GSAT-29 కమ్యూనికేషన్ ఉపగ్రహాల సహాయంతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించబోతోంది. దీంతో దేశవ్యాప్తంగా హైస్పీడ్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని కంపెనీ చెబుతోంది.
శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది
శాటిలైట్ ఇంటర్నెట్ వైర్‌లకు బదులుగా లేజర్ కిరణాలను ఉపయోగించి అంతరిక్షం నుండి డేటా బదిలీ చేయబడుతుంది. లేజర్ సిగ్నల్ బాగా ఉండాలంటే, ఒక శాటిలైట్ సమీపంలోని మరో నాలుగు శాటిలైట్ తో కమ్యూనికేట్ చేస్తుంది. అప్పుడు ఆ శాటిలైట్ మరో నాలుగు శాటిలైట్ కనెక్ట్ తో అవుతాయి. ఈ విధంగా ఆకాశంలో శాటిలైట్ నెట్‌వర్క్ సృష్టించబడుతుంది, ఇది భూమిపై వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందిస్తుంది. అంటే, శాటిలైట్ ఇంటర్నెట్ స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇంకా బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ లేని లేదా ఇంటర్నెట్ స్పీడ్ సమస్య ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ కనెక్ట్ చేయబడుతుంది.