రూ. 349కే 2.5జిబి హై-స్పీడ్ డైలీ డేటాతో జియో ప్రీ-పెయిడ్ ప్లాన్.. డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా
జియో రూ. 349 ప్రీ-పెయిడ్ ప్లాన్ రోజుకు 2.5జిబి హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇంకా అన్ని నెట్‌వర్క్‌ల కోసం ఈ ప్లాన్‌తో ఆన్ లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు.
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్రస్తుతం ఇండియాలోనే అతిపెద్ద టెలికాం కంపెనీ. కేవలం 4 సంవత్సరాలలో జియో ఎయిర్‌టెల్‌ను ఓడించి ఈ స్థానాన్ని సాధించింది. ప్రస్తుతం జియోకు 43 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. మీలో చాలా మంది జియో సిమ్ ఉపయోగీస్తుంటారు. రిలయన్స్ జియో ఇతర టెలికాం కంపెనీల లాగానే అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది, అయినప్పటికీ జియో ప్లాన్‌ల ధరలు ఇప్పటికీ ఎయిర్ టెల్ ఇంకా వోడా ఫోన్ ఐడియా కంటే చౌకగా ఉన్నాయి. అయితే రోజుకు 2.5జిబి డేటాని అందించే జియో ప్లాన్స్ గురించి తెలుసుకోండి...
జియో రూ.349 ప్లాన్
జియో రూ. 349 ప్రీ-పెయిడ్ ప్లాన్ అందిస్తుంది, ఈ ప్లాన్ తో రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. అన్ని నెట్‌వర్క్‌ల కోసం ఈ ప్లాన్‌తో ఆన్ లిమిటెడ్ కాలింగ్ కూడా లభిస్తుంది. జియో ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్ లు కూడా ఉంటాయి ఇంకా ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. జియో ఈ ప్లాన్‌తో జియో టివి, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ కి ఉచిత యాక్సెస్ ఇస్తుంది.
జియో రూ. 899 ప్లాన్
రిలయన్స్ జియో ఈ ప్లాన్‌తో మూడు నెలల (90 రోజులు) వాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో రోజుకు 2.5జిబి డేటా కూడా పొందవచ్చు. రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఇంకా రోజుకు 100 SMSలను అందిస్తుంది. జియో టివి, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి Jio యాప్‌లకు యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌తో ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో కంపెనీ వాలిడిటీ అయ్యే వినియోగదారులకు హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ 5G యాక్సెస్‌ను కూడా అందిస్తోంది.
రోజుకు 2.5 జిబి డేటాతో ఎయిర్ టెల్ ప్లాన్
ఎయిర్ టెల్ లో కూడా రోజుకు 2.5 GB డేటాతో ఎన్నో ప్లాన్‌లు ఉన్నాయి. ఇందులో ఒక ప్లాన్ ధర రూ. 399. ఈ ప్లాన్‌తో 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. దీనితో మంచి విషయం ఏమిటంటే డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల పాటు లభిస్తుంది ఇంకా దీనితో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంది.