రిలయన్స్ జియో ఇప్పుడు కొత్త జియో పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ఫ్రీ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కొత్త జియో పోస్ట్‌పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిని  మూడు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా అందిస్తుంది. 

భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలలో ఒకటైన రిలయన్స్ జియో (JIO) కస్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్‌లను అందిస్తోంది. సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను పెంచుకోవడానికి జియో ఈ రేసులో ముందుంది. అలాగే పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించేందుకు జియో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.

అవును, రిలయన్స్ జియో ఇప్పుడు కొత్త జియో పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ఫ్రీ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కొత్త జియో పోస్ట్‌పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిని మూడు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా అందిస్తుంది. అవి జియో రూ. 399, జియో రూ. 699. ఈ రెండూ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌లు. అలాగే జియో రూ.599 ప్లాన్ సింగిల్ ప్లాన్.

మీరు ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకదాన్ని 30 రోజుల పాటు ఉచితంగా ఉపయోగించవచ్చు. జియో రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఆన్ లిమిటెడ్ డేటాతో వస్తుంది. అదనంగా, ఆన్ లిమిటెడ్ కాల్స్, SMS కూడా ఉన్నాయి. జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, ఆన్ లిమిటెడ్ కాలర్ ట్యూన్ సౌకర్యాలు యూజర్లకు లభిస్తాయి. జియో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో 75GB డేటా, ఆన్ లిమిటెడ్ కాల్‌లు ఇంకా SMS చేయవచ్చు.

ప్లాన్‌తో 3 యాడ్-ఆన్ ఫ్యామిలీ సిమ్‌ల కోసం అప్షన్ కూడా ఉంది. ఒక్కో సిమ్‌కి 5GB డేటా అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో సావాన్ ఇంకా అన్‌లిమిటెడ్ కాలర్ ట్యూన్‌లు లభిస్తాయి. జియో రూ. 699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తో 100GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లతో వస్తుంది. అలాగే, టెక్స్ట్ మెసేజెస్ కూడా పంపవచ్చు.

ఈ ప్లాన్‌లో 3 యాడ్-ఆన్ ఫ్యామిలీ సిమ్‌ల అప్షన్ కూడా ఉంది ఇంకా అన్ని సిమ్‌లకు ఒక్కొక్కటి 5GB డేటా ఇస్తుంది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ OTT, ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఇంకా ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌తో పాటు వస్తుంది. అంతే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో సావాన్ అండ్ అన్‌లిమిటెడ్ కాలర్ ట్యూన్ కూడా ఉన్నాయి.