Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ కప్ కోసం జియో కొత్త రిచార్జ్ ప్లాన్‌లు.. వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

జియో ప్రత్యేకంగా ఈ అంతర్జాతీయ రోమింగ్ (IR) ప్లాన్‌లను FIFA వరల్డ్ కప్-2022 కోసం రూ. 1,122 ధరతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లలో రూ.1,599, రూ. 3,999, రూ. 5,122 అండ్ రూ.6,799  రిచార్జ్ ప్లాన్లు ఉన్నాయి.

Jio launches five new international roaming plans for World Cup, know what is special
Author
First Published Nov 21, 2022, 4:09 PM IST

ఫేడరేషన్ ఇంటెర్నేషనల్ ఫూట్ బాల్ అస్సోసియేషన్ ఫీఫా ప్రపంచ కప్-2022 అంటే ఫుట్‌బాల్ ప్రపంచ కప్ నేటి నుండి ఖతార్‌లో ప్రారంభం కానుంది. అయితే టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్రత్యేకంగా ఫీఫా ప్రపంచ కప్ కోసం 5 కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. భారతదేశం నుండి చాలా మంది ఫుట్‌బాల్ ప్రపంచ కప్ కోసం ఖతార్‌కు వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నారు అలాగే కొందరు ఇప్పటికే చేరుకున్నారు. ఈ అంతర్జాతీయ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్‌లతో  తక్కువ ఖర్చుతో  కనెక్ట్  కావొచ్చు అలాగే మొబైల్ బిల్లు కూడా ఎక్కువగా రాదు. జియో ఈ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం...

 జియో కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు
జియో ప్రత్యేకంగా ఈ అంతర్జాతీయ రోమింగ్ (IR) ప్లాన్‌లను FIFA వరల్డ్ కప్-2022 కోసం రూ. 1,122 ధరతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లలో రూ.1,599, రూ. 3,999, రూ. 5,122 అండ్ రూ.6,799  రిచార్జ్ ప్లాన్లు ఉన్నాయి. ఖతార్, యుఎఇ అండ్ సౌదీ అరేబియాలో ఈ ప్లాన్‌లు వర్తిస్తాయి. డేటా అండ్ డేటాతో అంతర్జాతీయ రోమింగ్, ఇతర సౌకర్యాలతో ఈ ప్లాన్‌లు రెండు క్యాటగిరిలో ప్రవేశపెట్టారు. 

జియో కొత్త డేటా ప్లాన్ 
ఈ కేటగిరీలో రెండు ప్లాన్‌లు ప్రవేశపెట్టారు, ఇందులో రూ. 1,122, రూ. 5,122 రీఛార్జ్ ఉన్నాయి. రూ. 1,122 ప్లాన్‌తో 5 రోజుల వాలిడిటీతో 1 GB డేటా  పొందుతారు. రూ. 5,122 రీఛార్జ్ ప్లాన్ అంతర్జాతీయ రోమింగ్‌తో 21 రోజుల వాలిడిటీ, 5జి‌బి డేటా అందిస్తుంది. 

జియో కొత్త డేటా అండ్ కాలింగ్ ప్లాన్‌లు
ఈ ప్లాన్‌లతో  యూజర్లు డేటా, రోమింగ్‌తో పాటు కాల్ చేసే సౌకర్యాన్ని పొందుతారు. ఈ క్యాటగిరిలో రూ. 1,599, రూ. 3,999 అండ్ రూ. 6,799 ప్లాన్‌లు ఉన్నాయి. రూ.1,599 ప్లాన్‌లో 15 రోజుల వాలిడిటీతో 1GB డేటా, 150 నిమిషాల కాలింగ్, 100SMSలు పొందుతారు. రూ.3,999 ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో 3GB డేటా, 250 నిమిషాల కాలింగ్, 100SMS అందిస్తుంది. రూ.6,799 ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో 5 GB డేటా, 500 నిమిషాల కాలింగ్, 100SMSలు అందిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios