Asianet News TeluguAsianet News Telugu

జియో కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. రోజుకు 2.5GB డేటాతో షాపింగ్ కూపన్స్ కూడా..

Jio కస్టమర్‌లు  సౌలభ్యం ప్రకారం ఈ రీఛార్జ్‌ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. Jio ఈ ప్లాన్‌తో 75 GB డేటాతో పాటు, Netmeds, AJIO, Ixigo రీడీమ్ కూపన్లు కూడా ఉంటాయి. రీఛార్జ్ చేసిన 72 గంటలలోపు ఈ కూపన్లు MyJio యాప్‌లో క్రెడిట్ చేయబడతాయి.

Jio introduced Independence Offer 2.5GB data per day along with 75GB data coupon
Author
Hyderabad, First Published Aug 10, 2022, 1:08 PM IST

రిలయన్స్ జియో స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్ సందర్భంగా '2999 ఇండిపెండెన్స్ ఆఫర్ 2022' రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. జియో  ప్రీ-పెయిడ్ కస్టమర్లు ఈ ప్లాన్ బెనెఫిట్స్ పొందవచ్చు. Jio ఈ ప్లాన్ ధర రూ. 2,999, ఈ ప్లాన్‌తో కస్టమర్‌లు  100% వాల్యు బ్యాక్ పొందుతారని కంపెనీ పేర్కొంది. జియో  ఈ ప్రత్యేక ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం...


Jio కస్టమర్‌లు  సౌలభ్యం ప్రకారం ఈ రీఛార్జ్‌ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. Jio ఈ ప్లాన్‌తో 75 GB డేటాతో పాటు, Netmeds, AJIO, Ixigo రీడీమ్ కూపన్లు కూడా ఉంటాయి. రీఛార్జ్ చేసిన 72 గంటలలోపు ఈ కూపన్లు MyJio యాప్‌లో క్రెడిట్ చేయబడతాయి.


Jio ఈ ప్లాన్‌తో కొంత 75 GB డేటా వోచర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి, వీటిని మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ కింద, మీరు 25% తగ్గింపుతో Netmeds మూడు కూపన్‌లను పొందుతారు. ఈ కూపన్ సహాయంతో రూ.5,000 వరకు తగ్గింపు తీసుకోవచ్చు.

Netmeds కూపన్ 9 ఆగస్టు నుండి 31 అక్టోబర్ వరకు వాలిడిటీ అవుతుంది. ఇక్సిగో(Ixigo)తో రూ.750 తగ్గింపు కూడా ఉంటుంది. మీరు ఈ సైట్ నుండి రూ. 4,500 లేదా అంతకంటే ఎక్కువ ధరతో విమాన టిక్కెట్లను బుక్ చేసుకుంటే, మీకు రూ.750 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా, అజియోపై రూ.1,000 తగ్గింపు ఉంటుంది.

ఇప్పుడు Jio ఈ రూ. 2,999 ప్లాన్  ప్రయోజనాల గురించి మాట్లాడితే ప్రతిరోజూ 2.5 GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్‌తో రోజుకు 100 SMSలు కాకుండా, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ అండ్ ఒక సంవత్సరం పాటు Disney + Hotstar సబ్‌స్క్రిప్షన్ కూడా ఇస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios