భారతదేశపు మొదటి సాటిలైట్-ఆధారిత గిగాబిట్ బ్రాడ్‌బ్యాండ్‌.. రిమోట్ ప్రదేశాలను కూడా కనెక్ట్ చేసునేందుకు..

రిలయన్స్ Jio నేడు శుక్రవారం జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో JioSpaceFiber అనే కొత్త శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ను చూపించింది. ఈ సర్వీస్  అత్యంత సరసమైన ధరలలో దేశవ్యాప్తంగా అన్ని మూలాల్లో  అందుబాటులో ఉంటుంది.  

jio demonstrates indias first satellite based gigabit broadband to connect the remotest corners of india-sak

ఢిల్లీ, 27 అక్టోబర్ 2023: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ మొబైల్ డేటా నెట్‌వర్క్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, భారతదేశంలో ఇంతకుముందు అందుబాటులో లేని  ప్రాంతాలకు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్ ప్రదర్శించింది.

రిలయన్స్ Jio నేడు శుక్రవారం జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో JioSpaceFiber అనే కొత్త శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ను చూపించింది. ఈ సర్వీస్  అత్యంత సరసమైన ధరలలో దేశవ్యాప్తంగా అన్ని మూలాల్లో  అందుబాటులో ఉంటుంది. నేడు Jio 45 కోట్లకు పైగా భారతీయ వినియోగదారులకు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఫిక్స్‌డ్ లైన్ అండ్  వైర్‌లెస్ సేవలను అందిస్తుంది.

భారతదేశంలోని ప్రతి ఇంటికి డిజిటల్ కనెక్టివిటీ  వేగవంతం చేయడానికి జియో JioSpaceFiberని బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్   ప్రీమియర్ లైనప్  JioFiber అండ్  JioAirFiberతో తీసుకొచ్చింది. జియోతో వినియోగదారులు, వ్యాపారాలు లొకేషన్‌తో సంబంధం లేకుండా నమ్మకమైన, తక్కువ జాప్యం, హైస్పీడ్ ఇంటర్నెట్,  ఎంటెర్టైనేమేంట్ సేవలకు యాక్సెస్‌ పొందుతారు.

శాటిలైట్ నెట్‌వర్క్ మొబైల్ బ్యాక్‌హాల్ కోసం హై  కెపాసిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో జియో ట్రూ5G లభ్యత ఇంకా స్కేల్ మరింత మెరుగుపరుస్తుంది. జియో ప్రపంచంలోని సరికొత్త మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO) సాటిలైట్ టెక్నాలజీకి  యాక్సెస్ చేయడానికి SESతో పార్ట్నర్షిప్  చేసుకుంటుంది, ఇది అంతరిక్షం నుండి ప్రత్యేకమైన గిగాబిట్, ఫైబర్ లాంటి సేవలను అందించగల ఏకైక MEO కాన్స్టెలేషన్.

SES  O3b, కొత్త O3b mPOWER శాటిలైట్స్ కాంబినేషన్ కి Jioకి యాక్సెస్‌ ఉండటంతో, గేమ్-ఛేంజింగ్ టెక్నాలజీని అందించే ఏకైక కంపెనీ, దీని ద్వారా భారతదేశం అంతటా స్కేలబుల్ అండ్  సరసమైన బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడంతోపాటు, హామీ ఇచ్చినట్లుగా     నమ్మకమైన,  సర్వీస్ సౌలభ్యతతో పరిశ్రమలో మొదటిది. దాని శక్తిని ప్రదర్శించడానికి, చేరుకోవడానికి భారతదేశంలోని నాలుగు రిమోట్ లొకేషన్స్  ఇప్పటికే JioSpaceFiberతో అనుసంధానించబడ్డాయి:

▪ గిర్ గుజరాత్
▪ కోర్బా ఛత్తీస్‌గఢ్
▪ నబ్రంగ్‌పూర్ ఒడిస్సా
▪ ONGC-జోర్హట్ అస్సాం

“జియో భారతదేశంలోని కోట్లాది  ఇంటిని, వ్యాపారాలను మొదటిసారిగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను ఎక్స్పీరియన్స్ చేసేలా  చేసింది. JioSpaceFiberతో ఇంకా కనెక్ట్ కానీ కోట్లాది మందిని కవర్ చేయడానికి మేము మా పరిధిని విస్తరించాము”

"JioSpaceFiber ఆన్‌లైన్ గవెర్నమెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్  ఎంటెర్టైయిన్మెంట్ సేవలకు గిగాబిట్ యాక్సెస్‌తో ప్రతి ఒక్కరూ, ప్రతిచోటా, కొత్త డిజిటల్ సొసైటీలోకి ఆహ్వానిస్తుంది." అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు.

"జియోతో కలిసి భారతదేశంలోని ఏ ప్రదేశానికి అయినా సెకనుకు మల్టి గిగాబిట్‌ అందించాలనే లక్ష్యంతో ఒక గొప్ప పరిష్కారంతో భారత ప్రభుత్వం  డిజిటల్ ఇండియా చొరవకు సపోర్ట్  ఇవ్వడం మాకు గౌరవంగా ఉంది". "అంతరిక్షం నుండి మా మొదటి ఫైబర్ లాంటి సేవలు ఇప్పటికే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అందించబడ్డాయి ఇంకా దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా దారితీస్తుందో చూడటానికి మేము వేచి ఉన్నాము అని SESలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ జాన్-పాల్ హెమింగ్‌వే అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios