Jio 5G speed test details: గుడ్‌న్యూస్.. 5జీ ప్రారంభానికి రంగం సిద్ధం

దేశంలో ఇంటర్నెట్ రంగంలో పెనుమార్పులు రానున్నాయి. 5 జీ ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ టెలీకాం కంపెనీ జియో 5జి టెస్ట్‌లో దూసుకుపోతోంది. ఆ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి.
 

Jio 5G speed test details

దేశంలో ఇంటర్నెట్ రంగంలో పెనుమార్పులు రానున్నాయి. 5 జీ ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ టెలీకాం కంపెనీ జియో 5జి టెస్ట్‌లో దూసుకుపోతోంది. ఆ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి.

భారతదేశంలో 5జి నెట్‌వర్క్ త్వరలో అందుబాటులో వచ్చేందుకు రంగం సిద్ధమౌతోంది. ఇప్పటికే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలు టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా 5 జి నెట్‌వర్క్ రంగంలో దూసుకుపోయేందుకు జియో సంస్థ అన్ని విధాలా సిద్ధమౌతోంది. 2022 చివరినాటికి ఇండియాలో 5జి నెట్‌వర్క్ అందుబాటులో రావచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. దేశంలోని 13 మెట్రో నగరాల్లో ప్రాధమిక దశలో 5 జి నెట్‌వర్క్ ప్రారంభించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకటించింది. 

దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ విషయంలో జియో 5జి (Jio 5G) రేసులో ముందుండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే 5జి నెట్‌వర్క్ అందుబాటులో రాగానే..కస్టమర్లకు సౌలభ్యం కోసం వేయి నగరాల్లో 5జి సేవలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది జియో. ఇప్పటికే జియో 5జి ట్రయల్ (Jio 5G Test) రన్ నిర్వహించింది. అధికారికంగా ఆ టెస్ట్ వివరాలు ప్రకటించకపోయినా..సమాచారం మాత్రం లీకైంది. జియో 5జి టెస్ట్‌లో స్పీడ్ 4 జి కంటే 8 రెట్లు అత్యధికంగా ఉన్నట్టు తెలిసింది. 420 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తోనూ, 412 అప్‌లోడ్ స్పీడ్‌తోనూ జియో 5జి నెట్‌వర్క్ ఉన్నట్టు టెస్ట్ ఫలితాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న 4జి కంటే ఇది ఏకంగా 15 రెట్లు అధికం. జియో 4 జి స్పీడ్ ఇప్పుడు డౌన్‌లోడ్ అయితే 46.82 ఎంబీపీఎస్, అప్‌లోడ్ అయితే 25.31 ఎంబీపీఎస్‌గా ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇంతటి స్పీడ్‌తో  రెండు గంటల సినిమాను కేవలం ఒక్క నిమిషంలోనే డౌన్‌లోడ్ చేసేయవచ్చు.

ఇప్పటికే ముంబై నగరంలో జియో 5జి నెట్‌వర్క్ పరీక్షలు (Jio 5G Test Details Leaked) పూర్తయ్యాయి. జియో 5 జి నెట్‌వర్క్ స్పీడ్ డౌన్‌లోడ్‌లో 8 రెట్లు, అప్‌లోడ్‌లో 15 రెట్లు ఎక్కువగా ఉంది. త్వరలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, గురుగ్రామ్, చండీగఢ్, బెంగళూరు, అహ్మదాబాద్, జామ్ నగర్, హైదరాబాద్, పూణే, లక్నో, గాంధీనగర్ వంటి ఎంపిక చేసిన నగరాల్లో 5జి నెట్‌వర్క్ ప్రాథ‌మికంగా విడుదల కానుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios