Asianet News TeluguAsianet News Telugu

జియో 5జి ఫోన్.. తక్కువ ధరకే అందుబాటులోకి.. ప్రకటించిన అంబానీ..

గూగుల్ అండ్ Qualcomm భాగస్వామ్యంతో జియో ఫోన్ 5G రానుంది. ఈ ఫోన్ 5G కనెక్టివిటీతో చౌకైన ఫోన్ కూడా అవుతుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 480 5G ప్రాసెసర్‌తో అందించనుంది. 

Jio 5G phone announced in partnership with Google, expected to launch next year
Author
First Published Aug 29, 2022, 5:19 PM IST


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 45వ ఆన్యువల్ జనరల్ మీటింగ్ (AGM 2022) ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో జియో 5జీ సేవలను ప్రారంభించడంతోపాటు, జియో ఫోన్ 5జీని కూడా లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.  రిలయన్స్ జియో 5G ఫోన్‌ను పరిచయం చేయడానికి Googleతో కలిసి పనిచేస్తోందని కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ సంవత్సరం జియో 5G ఫోన్ లాంచ్‌ చూడలేమని, వచ్చే ఏడాది వచ్చే అవకాశం ఉందని సూచించింది.

గూగుల్ అండ్ Qualcomm భాగస్వామ్యంతో జియో ఫోన్ 5G రానుంది. ఈ ఫోన్ 5G కనెక్టివిటీతో చౌకైన ఫోన్ కూడా అవుతుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 480 5G ప్రాసెసర్‌తో అందించనుంది. 

ప్రస్తుతం, మార్కెట్‌లో చాలా 5G ఫోన్‌లు రూ. 20,000 ధర విభాగంలో  అందుబాటులో ఉన్నాయి. Jio 5G ఫోన్ ధర రూ. 15,000 కంటే తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

Jio ఫోన్ 5G స్పెసిఫికేషన్లు
Jio ఫోన్ 5G ఫిచర్ల గురించి మాట్లాడితే 6.5-అంగుళాల HD + IPS LCD డిస్ ప్లేను పొందవచ్చు, అలాగే 1600x720 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 480 5 జి ప్రాసెసర్‌తో 32 జిబి స్టోరేజ్, 4 జిబి ర్యామ్‌ అందించవచ్చు. అలాగే ఈ ప్రాసెసర్ చౌకైన 5G ప్రాసెసర్.

ఫోన్ ఇతర స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, 13-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్ లో చూడవచ్చు, ఇంకా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్చేస్తుంది. ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఫోన్‌లో చూడవచ్చు.

ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో 5G సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. అలాగే ఎయిర్‌టెల్ కూడా కస్టమర్ల కోసం 5G సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. రిలయన్స్ జియో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మరియు చెన్నై వంటి ప్రధాన నగరాలకు మొదట 5G సేవలను అందజేయనున్నట్లు ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios